Begin typing your search above and press return to search.
రజనీకాంత్ నిర్ణయంపై రియాక్టైన మోహన్ బాబు
By: Tupaki Desk | 1 Jan 2021 4:40 AM GMT‘రాజకీయాల్లోకి రావట్లేదు’ అంటూ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన ప్రకటన చాలామందిని నిరాశకు గురిచేసింది. ఇక అభిమానుల గురించి చెప్పాల్సిన పనిలేదు. వారు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. చాలా మంది కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇప్పటికీ.. ‘రజనీ రాజకీయాల్లోకి రావాల్సిందే..’ అంటూ రోడ్డెక్కి గొడవ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రజనీకాంత్ ఆప్త మిత్రుడు.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తలైవా పొలిటికల్ ఎంట్రీపై స్పందించారు.
రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకపోవడమే మంచిదని అన్నారు. ఈమేరకు మోహన్‌బాబు ఓ లేఖ కూడా విడుదల చేశారు. “రజినీకాంత్ నాకు అత్యంత ఆత్మీయుడు అన్న సంగతి మీ అందరికీ తెలుసు. తన ఆరోగ్య రీత్యా పాలిటిక్స్ లోకి రావడం లేదు అని ప్రకటించాడు. ఒకరకంగా తను రాజకీయాల్లోకి రాకపోవడం మీకు, అభిమానులందరికీ బాధ అయినప్పటికీ ఒక స్నేహితుడిగా తన ఆరోగ్యం గురించి పూర్తి అవగాహన ఉన్న ఒక వ్యక్తిగా రజినీ రాజకీయాల్లోకి రాకపోవడం మంచిది అని నమ్ముతున్నాను. నా మిత్రునితో ఎన్నో సందర్భాల్లో చెప్పాను. నువ్వు మంచివాడివి. చీమకు కూడా హాని చేయని వాడివి. నా దృష్టిలో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పర్సన్.. నీ లాంటి వ్యక్తికి, నాలాంటి వ్యక్తికి రాజకీయాలు పనికిరావు’ అని పేర్కొన్నారు మోహన్ బాబు. ఇంకా పాలిటిక్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన మోహన్ బాబు.. రాజకీయం ఒక బురద గుంట అన్నారు.
‘మనం ఉన్నది ఉన్నట్టు నిక్కచ్చిగా మాట్లాడతాం. ఎవరికీ ద్రోహం చేయం. డబ్బులు ఇచ్చి ఓట్లు, సీట్లు కొనలేం. కొనము కూడా. ఇక్కడ ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియదు. రాజకీయాల్లోకి రానంత వరకు మంచి వాడివి అన్న వాళ్లే.. రేపు వచ్చిన తర్వాత చెడ్డవాడని అంటారు. రాజకీయం ఒక రొచ్చు. ఒక బురద. ఆ బురద అంటకుండా నువ్వు రాక పోవడమే మంచిదయ్యింది. రజనీకాంత్ అభిమానులు అందరూ రజనీకాంత్ అంత మంచి వాళ్లు. మీరందరూ సహృదయంతో నా మిత్రుడు తీసుకున్న నిర్ణయాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను“ అంటూ లేఖను ముగించారు మోహన్ బాబు.