Begin typing your search above and press return to search.
ఇవేం కథనాలు?:మీడియాకు మోహన్ బాబు ప్రశ్న
By: Tupaki Desk | 15 March 2017 6:50 AM GMTసినీ రంగంలో చోటుచేసుకునే ఏ చిన్న ఘటన అయినా... ఒక్కసారిగా బాంబులా పేలుతున్న వైనం మనకు తెలిసిందే. ఈ క్రమంలో నిన్న టాలీవుడ్ ను కుదిపేసిన సహజ నటి జయసుధ భర్త నితిన్ కపూర్ ఆత్మహత్యపై కూడా మీడియా తనదైన శైలిలో కథనాలు రాసేసింది. నితిన్ ఆత్మహత్యకు ఇప్పటిదాకా కారణాలేమీ స్పష్టం కాకపోయినా... ఆయన సూసైడ్‌కు ఇదే కారణమంటూ పలు కథనాలు తెలుగు మీడియాలో కనిపించాయి. ఈ కథనాలపై టాలీవుడ్ ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు చాలా ఘాటుగా స్పందించారు. వాస్తవాలేంటో తెలియకుండానే ఊహాజనిత కథనాలు రాసేస్తున్నారంటూ ఆయన మీడియా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫలానా కారణంతోనే నితిన్ ఆత్మహత్య చేసుకున్నారంటూ మీరెలా చెబుతారంటూ ఆయన సంధించిన ప్రశ్నలకు మీడియా మిత్రుల వద్ద సమాధానాలు లేవనే చెప్పాలి. నితిన్ ఆత్మహత్యపై వస్తున్న కథనాలు జయసుధ కుటుంబాన్ని ఆవేదనకు గురి చేస్తున్నాయని పేర్కొన్న ఆయన... మీడియా మిత్రులు సంయమనంతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. నితిన్ ఆత్మహత్యకు స్పష్టమైన కారణం తెలిసేదాకా కూడా... దానిని అనుమానాస్పద ఘటనగానే రాయాలంటూ ఆయన మీడియాకు సూచించారు. జయసుధను సోదరిలా భావించే మోహన్ బాబు మీడియా చేస్తున్న హడావిడిపై ఆగ్రహం వ్యక్తం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అయినా మీడియాకు మోహన్ బాబు చేసిన సూచనల విషయానికి వస్తే... జయసుధ నా సోదరి - నితిన్ ఆత్మహత్యపై ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాటడం సరికాదు. నితిన్ ఆత్మహత్యకు ఇప్పటిదాకా కారణమేమీ తెలియదు. ఆర్థిక కారణాలే ఈ ఘటనకు కారణమని చెప్పడం శుద్ధ అబద్ధం. ఆ కుటుంబం ఆర్థికంగా బాగా స్థిరపడ్డ కుటుంబం. అయితే ఫలానా కారణాల వల్లే నితిన్ ఆత్మహత్య చేసుకున్నారంటూ పలు మీడియా సంస్థలు వార్తలు రాయడం బాధాకరం. ఇకనైనా అలాంటి అసత్య కథనాలు రాయొద్దని అభ్యర్థిస్తున్నా. ఆర్థిక ఇబ్బందులతోనే నితిన్ ఆత్మహత్య చేసుకున్నారన్న వార్త ఇక రాయొద్దు. దానిని అనుమానాస్పద మృతిగానే పరిగణించాలని రాయండి* అని మోహన్ బాబు మీడియా ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉంటే... ఆత్మహత్య చేసుకోవడానికి నాలుగు రోజుల ముందు నితిన్ తన భార్య జయసుధను తీసుకుని మోహన్ బాబు ఇంటికి వెళ్లారట. ఈ సందర్భంగా నితిన్ ఆరోగ్యంపై మోహన్ బాబు ఆరా తీశారట. అదే సమయంలో తాను ఓ చిత్రాన్ని తెరకెక్కించాలనుకుంటున్నానని నితిన్ చెప్పగా... అందులో తాను ఓ గెస్ట్ రోల్ లో నటిస్తానని, అందుకు తనకు ఏమాత్రం రెమ్యూనరేషన్ అవసరం లేదని కూడా మోహన్ బాబు చెప్పారట. ఆ సందర్భంగా తన ఇంటిలోనే జయసుధ, నితిన్ లు లంచ్ చేశారని కూడా మోహన్ బాబు గుర్తు చేసుకున్నారు. ఇదిలా ఉంటే... గత కొద్ది రోజులుగా నితిన్ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన ఇటీవల ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స కూడా తీసుకున్నారట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/