Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ సినిమాలో మోహన్ బాబు ఎంట్రీ

By:  Tupaki Desk   |   26 Jun 2018 8:18 AM GMT
ఎన్టీఆర్ సినిమాలో మోహన్ బాబు ఎంట్రీ
X
తెలుగులోనూ బయోపిక్ లకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని మహానటి సినిమా ప్రూవ్ చేసింది. అలనాటి మేటి నటి సావిత్రి జీవిత గాథతో వచ్చిన ఈ సినిమాలో కాస్టింగ్ హైలైట్ గా నిలిచిన అంశాల్లో ఒకటి. చిన్న చిన్న క్యారెక్టర్లు కూడా పేరున్న నటులు చేయడం ఆ సినిమాపై బజ్ పెరగడానికి కారణమైంది.

ఇప్పుడు విఖ్యాత నటుడు నందమూరి తారకరామారావు జీవితగాథతో ఆయన తనయుడు... హీరో బాలకృష్ణ తీయబోయే బయోపిక్ విషయంలోనూ ఈ ఐడియాను ఫాలో అయిపోతున్నారు. దీంతో ఈ సినిమాపై రోజుకో రూమర్ వస్తోంది. తాజాగా ఈ బయోపిక్ లో విలక్షణ నటుడు మోహన్ బాబు ఓ ఇంపార్టెంట్ రోల్ చేయబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది. మోహన్ బాబుకు ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానం. ఎన్టీఆర్ పిలుపుతోనే మోహ‌న్ బాబు రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టారు. బాలకృష్ణ‌తోనూ ఆయ‌న‌కు మంచి రిలేషన్సే ఉన్నాయి. కాబట్టి ఎన్టీఆర్ బయోపిక్ లో ఏదయినా రోల్ ఆఫర్ చేస్తే మోహన్ బాబు కాదనే ఛాన్స్ ఉండదు.

మహానటి సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు పాత్రను ఆయన మనవడు.. హీరో నాగచైతన్య చేశాడు. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ లోనూ ఈ రోల్ నాగచైతన్యకే ఆఫర్ చేసినట్టు తెలిసింది. నాగచైతన్య కూడా ఓకే అంటాడనే యూనిట్ నమ్మకంతో ఉంది. ఎన్టీఆర్ బయోపిక్ ను క్రిష్ డైరెక్ట్ చేయనున్నాడు.