Begin typing your search above and press return to search.
'ప్రతి కుక్కకూ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు'
By: Tupaki Desk | 4 Oct 2021 8:31 AM GMT'మా' (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికలు ఈసారి రసవత్తరంగా జరుగుతున్నాయి. అధ్యక్ష పదవి కోసం ఎందరో తెరపైకి రాగా.. చివరకు మంచు విష్ణు - ప్రకాష్ రాజ్ మాత్రమే బరిలో నిలిచారు. అక్టోబర్ 10న జరగబోయే ఎన్నికల కోసం నువ్వా నేనా అన్నట్లుగా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. మరో ఆరు రోజుల్లో జరగనున్న 'మా' ఎలక్షన్స్ మీద కలెక్షన్ కింగ్ మోహన్ బాబు స్పందించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చిరంజీవి కుటుంబం నుంచి ఎవరైనా ‘మా’ ఎన్నికల్లో నిలబడి ఉండుంటే తాను మంచు విష్ణుని విత్ డ్రా అవ్వమని చెప్పేవాడినని మోహన్ బాబు తెలిపారు..
''చిరంజీవి ఎప్పటికీ నాకు స్నేహితుడే. చిరంజీవి కుమారుడు నాకు బిడ్డ లాంటి వాడే. ఆ బిడ్డ కానీ.. అరవింద్ పిల్లలు కానీ.. నాగబాబు పిల్లలు కానీ.. ఆ కుటుంబంలోని ఏ బిడ్డలైనా నిలబడి ఉంటే.. చిరంజీవి హ్యాపీగా అలా అడిగి ఉంటే.. వెంటనే విష్ణును విత్ డ్రా చేసుకోని చెప్పే వాణ్ణి. ఏకగ్రీవంగా మా చిరంజీవి అబ్బాయి, మా నాగబాబు అబ్బాయి, మా అరవింద్ అబ్బాయి.. మా నాగార్జున అబ్బాయి అని చెప్పడానికి నాకు అభ్యంతరమే లేదు'' అని మోహన్ బాబు అన్నారు.
''ప్రకాష్ రాజ్ కు చిరంజీవి ఎందుకు సపోర్ట్ చేశారో తెలియదు. చిరంజీవి ఇప్పటికీ ఎప్పటికీ నాకు స్నేహితుడే. ప్రకాశ్ రాజు స్నేహితుడు కాదు. స్నేహితుడు అంటే రజనీకాంత్ - అంబరీష్. కష్టసుఖాల్లో పాలుపంచుకొనేవాడు స్నేహితుడు. స్నేహితుల్లో చాలా రకాలు ఉంటారు. మేమందరం సినిమా స్నేహితులం'' అని మోహన్ బాబు తెలిపారు.
'మా' ఎన్నికల్లో తన కుమారుడు మంచు విష్ణు విజయం సాధిస్తాడని.. ప్రెసిడెంట్ గా ప్రమాణస్వీకారం చేసి ఇచ్చిన మాట ప్రకారం ‘మా’ భవనం కట్టించి తీరతాడని మోహన్ బాబు ధీమా వ్యక్తం చేశారు. ప్రకాష్ రాజ్ తో తనకు విభేదాలు లేవని.. తాను ఎక్కడైనా కనిపిస్తే 'అన్నయ్యా బాగున్నారా' అని బాగానే మాట్లాతాడని తెలిపారు. జయసుధ మద్దతు తమకే ఉంటుందని భావించామని.. అందరూ అదే అనుకున్నారని.. కానీ ఆమె అవతలి ప్యానల్ కుసపోర్ట్ చేసారని.. అది ఆమె వ్యక్తిగత విషయమని మోహన్ బాబు చెప్పారు.
'మా' ఎన్నికల్లో మద్దతు కోరుతూ తాను దాదాపు 800 మంది సభ్యులతో ఫోన్ లో మాట్లాడానని.. మంచు విష్ణు కూడా సుమారు 600 మందితో మాట్లాడాడని.. కొంతమందిని కలిశాడని.. వారి మద్దతు తమకే ఉందని మోహన్ బాబు తెలిపారు. తెలిసిన వాడు తెలియని వాడు.. కొందరు వెదవలు.. అదేదో కిరీటం అద్భుతం అనుకొని అసలు క్యారెక్టర్స్ లేని కొంతమంది 'మా' ఎన్నికలను బ్రష్టు పట్టించారని ఆరోపించారు.
''పంచభూతాల సాక్షిగా చెబుతున్నాను. విష్ణు బాబుని 'మా' ఎన్నికల్లో పోటీలో నిలబెట్టాలనే ఆలోచనే లేదు. సడన్ గా విష్ణు ఒకరోజు డాడీ 'గురువుగారు అడిగినప్పుడు మీరు వద్దన్నారు. ఇప్పుడు ఉంటే బెటర్ కదా' అని అడిగాడు. యూనివర్సిటీ అర్హతలు ఉన్న కాలేజీలు చూసుకోవాలి. సక్సెస్ అయినా ఫెయిల్ అయినా సినిమాల్లో యాక్ట్ చేయాలి.. సినిమాల మీద కాన్సన్ట్రేషన్ చేయాలి.. నలుగురు బిడ్డల తండ్రివి.. ఇన్ని బాధ్యతలు ఉన్నాయి.. అప్పుడు నన్ను ఎన్నుకున్నట్లే ఏకగ్రీవంగా అయితే బాగుంటుంది అనిపించి ఒకరిద్దరికి ఫోన్ చేసి మాట్లాడమన్నా. ఇప్పుడు ఇంకొకరు వచ్చారు. కానీ అది నేను ఊహించలేదు'' అని మోహన్ బాబు అన్నారు.
ప్రకాశ్ రాజ్ గురించే మాట్లాడుతున్నారా అని ప్రశ్నించగా.. ''ఐ డోన్ట్ వాంట్ టు సే హిజ్ నేమ్. వాళ్లకు నా జాతకం తక్కువ తెలుసు. కానీ నా కళ్ళ ముందు వచ్చిన వాళ్ల జాతకాలు నాముందు పేజీ బై పేజీ ఉంది. కానీ నాకు పెద్దరికం ఉంది. ఎడ్యుకేషనలిస్టుగా, విద్యాసంస్థల చైర్మన్ గా నేను వాళ్ల జీవితాల గురించి మాట్లాడదలుచుకోలేదు. అందరం కళామ తల్లి బిడ్డలం. ఏదైనా వస్తే చిన్నా పెద్దా ఉండాలి. కానీ అదేమీ లేదు. ఎవరికి వారే యమునా తీరే.. యథా రాజా తథా ప్రజా అన్నట్టుగా ఉంది. ఎవరికి వారే గొప్ప అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆవేశం వొస్తూ ఉంటుంది. మాట్లాడనివ్వండి. ఒక సామెత ఉంది కదా.. 'మదగజంబు మార్గమున వెళుచుండ కుక్కలెన్ని మొరుగుట లేదని'.. కుక్కలు మొరుగుతుంటాయి.. ప్రతి కుక్కకూ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు'' అని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.