Begin typing your search above and press return to search.

#MAAelection : పోలింగ్ బూత్ లో మోహన్ సీరియస్ వార్నింగ్

By:  Tupaki Desk   |   10 Oct 2021 5:32 AM GMT
#MAAelection  : పోలింగ్ బూత్ లో మోహన్ సీరియస్ వార్నింగ్
X
'మా' ఎన్నికలు ఈరోజు ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. జూబ్లీ హిట్స్ లోని పబ్లిక్ స్కూల్ లో 8గంటల నుంచి పోలింగ్ కొనసాగుతోంది. సినీ తారలు ఒక్కొక్కరుగా వచ్చి ఓటు వేస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ 'మా' ఎన్నికల్లో తొలి ఓటును వినియోగించుకున్నారు. అందరికంటే ముందే ఉదయం పోలింగ్ కేంద్రానికి చేరుకొని మొదటి ఓటు వేశారు. ఆ తర్వాత సినీ ప్రముఖులు అంతా ఒక్కొక్కరుగా వచ్చి ఓటు వేస్తున్నారు.

ఆదివారం ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటలకు మా పోలింగ్ కొనసాగుతుంది. అనంతరం సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఫలితాలను కూడా ఇదే రోజు రాత్రి ప్రకటిస్తారు. రాత్రి 8 గంటలలోపు ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

పవన్ తర్వాత వరుసగా చిరంజీవి, రాంచరణ్, బాలక్రిష్ణ, నరేశ్, సాయికుమార్, శివాజీరాజా, సుడిగాలి సుధీర్ సహా సినీ ప్రముఖులు అంతా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

'మా' పోలింగ్ లో రసాభాస చోటుచేసుకుంది. పోలింగ్ బూత్ లో మోహన్ బాబు ఆవేశంతో ఊగిపోయాడు. నటుడు బెనర్జీని చంపేస్తానంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఈ క్రమంలోనే విష్ణు ప్యానెల్, ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు తిట్టుకున్నారు. పోలింగ్ బూత్ లో ఎన్నికల అధికారితో మోహన్ బాబు మాట్లాడడంపై ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో బెనర్జీపై మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు చేస్తున్నారు' అని మోహన్ బాబు పోలింగ్ బూత్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సమీర్ పై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. శివబాలాజీ-హేమల మధ్య వాగ్వాదం కూడా చోటుచేసుకుంది.