Begin typing your search above and press return to search.

మళ్లీ నువ్వే కావాలి.. మోహన్‌ బాబు ఎమోషనల్‌ ట్వీట్‌

By:  Tupaki Desk   |   8 Oct 2020 10:36 AM
మళ్లీ నువ్వే కావాలి.. మోహన్‌ బాబు ఎమోషనల్‌ ట్వీట్‌
X
నేడు మంచు మోహన్‌ బాబు గారాల పట్టి.. ముద్దుల కూతురు మంచు లక్ష్మి పుట్టిన రోజు. ఈ సందర్బంగా ఆమెకు మోహన్‌ బాబు ట్విట్టర్‌ లో శుభాకాంక్షలు తెలియజేశాడు. తనదైశ శైలిలో కాస్త ఘాటైన తెలుగు పదాలను వాడి శుభాకాంక్షలు చెప్పడంతో పాటు ఆమె చిన్నప్పటి ఫొటోను షేర్‌ చేశాడు. మోహన్‌ బాబుకు కొడుకుల కంటే కూతురు అంటే ప్రేమ అంటూ సోషల్‌ మీడియాలో టాక్‌ ఉంది. మోహన్‌ బాబు వద్ద మంచు లక్ష్మి మాత్రమే మాట్లాడగలదు అని కూడా అంటారు. కూతురు అంటే ఇంత ప్రేమ ఉండటం వల్లే ఆయన కూతురుకు భయపడుతారు.

ఇంతకు ఆయన ట్విట్టర్‌ లో ఏమని ట్వీట్‌ చేశారంటే... నా ముద్దుల కుమార్తె మంచు లక్ష్మీ ప్రసన్న వజ్ర వైడూర్య పుష్య గోమేదిక మరకత మాణిక్యం లాంటి కుమార్తె పుట్టిన రోజు ఈ రోజు. మరొక జన్మంటూ ఉంటుందో లేదో తెలియదు కాని ఉంటే మళ్లీ ఈ లక్ష్మీ ప్రసన్నే నాకు కూతురుగా పుట్టాలని, నేను తనకు తండ్రిగా పుట్టాలని ఆ పంచభూతాలను ప్రార్థిస్తున్నాను.. హ్యాపీ బర్త్‌ డే టు మై డియర్‌ లవ్లీ లక్ష్మీ మంచు. ఎన్ని జన్మలైనా నువ్వు నా కూతురుగా పుట్టాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. లవ్‌ యూ 3000 అంటూ ట్వీట్‌ చేశాడు. ఈ 3000 అంటే ఏంటీ అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.