Begin typing your search above and press return to search.
మోహన్ బాబు కోటింగ్ అదిరింది
By: Tupaki Desk | 27 March 2016 5:28 AM GMTడబుల్ మీనింగ్ జోకులు.. హీరోయిన్లను కాస్త చీప్ గా మాట్లాడటం.. వేరే హీరోలపై క్యారెక్టర్ ఆర్టిస్టులపై సెటైర్లు వేయడం.. ఇవన్నీ ఆడియో ఫంక్షన్లలో ఈ మధ్యన రెగ్యలుర్ గా చోటుచేసుకుంటున్న అంశాలు. అయితే నిన్నటి ''ఈడోరకం ఆడోరకం'' ఆడియో ఫంక్షన్ లో కూడా సేమ్ ఇలాంటి పరిణామాలే చోటుచేసుకున్నాయి. కాని అందరూ ఇలా చెత్తగా మాట్లాడితే.. వీళ్ళకు బ్రేక్ వేసేదెపుడు? బ్రేక్ వేసేదెవరు? అందుకే అందరికీ కలిపి హోల్ సేల్ గా కోటింగ్ ఇచ్చారు డైలాగ్ కింగ్ మోహన్ బాబు.
దర్శకుడు నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. రైటర్ డైమండ్ రత్నం గురించి చెప్పమంటే.. ''రెండు పెగ్గులు వేస్తే మనోడు డైలాగులు బాగా రాస్తాడని'' సెలవిచ్చాడని. అంతేకాదు.. హీరోయిన్ సోనారికా బడోరియా అడిగితే కాని హగ్ ఇవ్వలేదు అని చెప్పుకొచ్చాడు. అలాగే రైటర్ డైమండ్ రత్నం మాట్లాడుతూ.. హీరోయిన్ తనకూ హగ్ ఇవ్వలేదని.. అడగకుండానే తాను తీసుకున్నానని చెప్పాడు. ఇవన్నీ మోహన్ బాబుకు పిచ్చెత్తించాయి. ఆయన మాట్లాడుతూ.. ''ఒక దర్శకుడిగా.. ఆడియో ఫంక్షన్ లో.. రైటర్ బాగా రాశాడని చెప్పాలి. హీరోయిన్ బాగా చేసిందనే చెప్పాలి. కాని చీప్ గా రెండు పెగ్గులు వేస్తేనే బాగా రాస్తాడని చెప్పావు. నువ్వు కూడా రోజూ రాత్రికి ఒక ఫుల్ తాగితేనే పొడుకుంటావని.. షూటింగ్ టైములో నీకు ప్రొడ్యూసర్లు రోజూ ఫుల్ బాటిల్ పంపాలని నాకు తెలుసు. దాని గురించి అందరికీ చెబితే ఎలా ఉంటుంది? నేను కూడా త్రాగుతాను. అందుకని దాని గురించి ఇలా పబ్లిక్ మీటింగులో లక్షల మంది టివిల్లో చూస్తున్నప్పుడు చెబుతావా?? తప్పు చేశావ్'' అంటూ సున్నితంగా కడిగిపాడేశారు.
ఇక రైటర్ బాబుకు కూడా ఒక రౌండ్ పడింది. ''హీరోయిన్ హగ్ ఇవ్వడమేంటి? అసలు ఎందుకివ్వాలి? ఆమెకు నచ్చితే ఆమె హగ్ ఇస్తుంది. అంతేకాని మీరు డైరక్టర్ రైటర్ అని హీరోయిన్లు హగ్గులిస్తారా? అయినాసరే సోనారిక మీ ఇద్దరికీ హగ్ ఇచ్చిందట. దర్శకుడికి ఒక మథర్లీ హగ్.. అలాగే రైటర్ కు ఒక సోదర భావంతో కూడిన హగ్ ఇచ్చింది. అంతే. ఇలాంటివి మానుకోండి'' అంటూ మందలించారు మోహన్ బాబు. యు ఆర్ గ్రేట్ మోహన్ బాబు. అప్పుడప్పుడూ మీ డోస్ లు మనోళ్ళకు కావాల్సిందే.