Begin typing your search above and press return to search.

సం 'మోహన' సిద్ధాంతం

By:  Tupaki Desk   |   20 Jan 2018 9:47 AM GMT
సం మోహన సిద్ధాంతం
X
ఇటీవలే విశ్వనట సార్వభౌమ బిరుదు అందుకున్న మోహన్ బాబు మంచి ఉత్సాహంతో కనిపిస్తున్నారు. మంచు విష్ణు కొడుకు రూపంలో తనకు తొలి మనవడు రావడం - బిరుదు ప్రధానం - మనవరాళ్ళ పేరు మీద మొదలు పెట్టిన బ్యానర్ లో తీసిన తన కం బ్యాక్ మూవీ గాయత్రి విడుదలకు సిద్ధంగా ఉండటం అన్ని బాగా కలిసి వస్తున్నాయి. ఎక్కడా ఉన్నా ఏ స్టేజి మీద అయినా తాను మనసులో ఏం అనుకుంటే అదే బయటికి చెప్పే అలవాటు ఉన్న మోహన్ బాబు ఇటీవలే జరిగిన ఇండియా టుడే సదస్సులో తమ మాటలతో అందరిని సమ్మోహన పరిచారు. పక్కన లక్ష్మి ప్రసన్న తోడుగా ఇంగ్లీష్ తో పాటు తమిళ్ - తెలుగు పదాలను మిక్స్ చేస్తూ తాను చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పిన కలెక్షన్ కింగ్ కు మంచి రెస్పాన్స్ దక్కింది.

చిన్నప్పుడు అందరూ ఇష్టంగా తినే ఇడ్లీ - దోసా లాంటివి తనకు దొరికేవి కాదని - చద్దన్నంతో కడుపు నింపుకున్న బాల్యాన్నే తాను చూశానని చెప్పిన మోహన్ బాబు ఇప్పుడు అన్ని ఉన్నా కూడా ఇడ్లీనే తింటున్నానని చెప్పారు. పాలిష్ చేసిన బియ్యం కొనేందుకు డబ్బులు లేక దంపుడు బియ్యం తినే రోజుల నుంచి డాక్టర్లు పాలిష్ బియ్యం వద్దు అంటే మళ్ళి దంపుడు బియ్యానికే మారాల్సి వచ్చిందని, ఎంత విచిత్రమో కదా అంటూ మోహన్ బాబు కాస్త వెరైటీగా జీవిత సారాన్ని చెప్పే ప్రయత్నం చేసారు. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు గిట్టక మానరని - ఇది నాది అనేది ఏది సొంతం కాదని, భూమి మాత్రమే శాశ్వతం అని చెబుతూ ఒకవేళ ఏదైనా నాదే అని విర్రవీగితే భూమి అలాంటి వాళ్ళను చూసి నవ్వుతుందని చెప్పడం ఆకట్టుకుంది.

ఒక రకమైన వేదాంత ధోరణిలో మాట్లాడిన మోహన్ బాబు మాట తీరులో మాత్రం తన ఒరిజినాలిటీ కొనసాగించారు. జీవితాన్ని ఏ కోణంలో చూడాలి అన్న దాని గురించి మోహన్ బాబు చెప్పిన జీవిత సత్యాలు అక్కడ ఉన్నవారందరిని ఆకట్టుకున్నాయి. సూటిగా వెళ్ళే మనస్తత్వం ఉన్న మోహన్ బాబు ఇలా సున్నితత్వంతో మాట్లాడ్డం బాగుంది కదూ. ఆయన నటించిన గాయత్రి సినిమా ఫిబ్రవరి 9 విడుదల చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది.