Begin typing your search above and press return to search.
#MB40: చిరంజీవి నాకు కలలో కూడా..
By: Tupaki Desk | 17 Sep 2016 5:38 PM GMTఇకపోతే ఎంబి40 ఈవెంట్లో చిట్టచివర మోహన్ బాబు ఇచ్చిన స్పీచ్ అంతా ఒకెత్తయితే.. అందులో మోగాస్టార్ చిరంజీవి గురించి ఆయన చెప్పిన మాటలు ప్రత్యేకం.
''చిరంజీవి నాకు కలలో కూడా చెడు చేయలేదు. నేను కూడా ఆయనకు ఎప్పుడు చెడు చేయలేదు. మేం గ్రేట్ ఫ్రెండ్స్ అంతే. నేను చిరంజీవితో చేసినన్ని సినిమాలు ఎవ్వరితోనూ చేయలేదు. ఇక చిరంజీవి తన తండ్రిని ఎంతో ప్రేమించేవారు.. అలాంటి ప్రేమ తన పెద్దకూతురుకు వచ్చింది. ఎక్కడ కనిపించినా అంకుల్ అని పిలుస్తుంది. అలాగే నాకు అల్లూ రామలింగయ్య గారంటే చాలా కష్టం. ఆయనంటే నాకు ఎంత ప్రేమో అరవింద్ మథర్ కు తెలుసు. ఇక అరవింద్ కూడా నాకు మంచి స్నేహితుడే. నాకు నాగబాబు అంటూ చాలా ఇష్టం. అది బయటకు తెలియదు. నా పేరు భక్తవత్సలం నాయుడు.. నేను పెద్దకాపును అన్నాను. అన్నా నువ్వా అంటూ నాగబాబు షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని ఇక్కడకు వచ్చేశాడు. చాలా మంచోడు తను'' అంటూ 'మెగా' పొగడ్తలతో ముంచెత్తారు మోహన్ బాబు.
''షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని వచ్చావ్ చిరంజీవి. మళ్లీ అదే కాంబినేషన్ డేట్లు దొరకాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు. హోల్ హార్డెడ్ థ్యాంక్స్ చిరంజీవి'' అంటూ కృతజ్ఞతలు చెప్పారు. అలాగే చిరంజీవి మథర్ కు నమస్కారాలు అంటూ చెప్పిన మోహన్ బాబు.. ''చిరంజీవి మర్చిపోతాడు నువ్వు మర్చిపోవు. అమ్మకు నా నమస్కారాలు. నువ్వు ఆవిడకు తెలియజేయి'' అని సెలవిచ్చారు.
''తదుపరి 40 ఏళ్ల సన్మానం జరిగేది చిరంజీవికే. ఆ సభను నా చేతిలో పెట్టు చిరంజీవి.. నేనే ముందుండి అంతా నడిపిస్తాను. చూడు అప్పుడు. ఆ తరువాత 40 ఏళ్ల పండుగ వెంకటేష్ దే'' అంటూ ముగించారు మోహన్ బాబు.