Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ లైఫ్ లో దుష్టులెవరు?
By: Tupaki Desk | 21 Dec 2018 4:49 PM GMTనేటి సాయంత్రం హైదరాబాద్ జేఆర్ సీ సెంటర్ లో నందమూరి కుటుంబ సభ్యులు - అభిమానుల సమక్షంలో `ఎన్టీఆర్ - కథానాయకుడు` ట్రైలర్-ఆడియో వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఎన్టీఆర్ తో తన సాన్నిహిత్యం గురించి మాట్లాడుతూ ఓ వివాదాస్పద వ్యాఖ్యను చేయడం ప్రస్తుతం ఫిలింసర్కిల్స్ సహా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ ఆయన ఏ కామెంట్ చేశారు... అంటే...?
ఎన్టీఆర్ లైఫ్ లో కొందరు చెడ్డవాళ్లు ఉన్నారు. వాళ్లను డైరెక్టర్ క్రిష్ ఈ చిత్రంలో చూపించారో లేదో తెలీదు కానీ అంటూ వ్యాఖ్యానించారు. చెడ్డవాళ్లను కూడా మంచివాళ్లుగానే చూపించాడేమో! అని సందేహం వ్యక్తం చేశారు. అంతేకాదు ఎన్టీఆర్ నాతో కొన్నిటిని షేర్ చేసుకున్నారు. వాటిని ఈ వేదికపై చెప్పలేనని అన్నారు మోహన్ బాబు.
మోహన్ బాబు స్పీచ్ అంతటిని విన్న అనంతరం వేదిక వద్ద ఆసక్తికర డిబేట్ సాగింది. ఇంతకీ ఎన్టీఆర్ జీవితంలో చెడ్డవాళ్లు ఎవరు? అంటూ ఆసక్తికర చర్చ సాగింది. ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్ రన్ అవుతోంది. ఇక మోహన్ బాబు మాట్లాడుతూ .. ఒకే గర్భంలో జన్మించకపోయినా నందమూరి తారకరామారావుగారు-నేను అన్నదమ్ములమే అన్నారు మోహన్ బాబు. మోహన్ బాబు మాట్లాడుతూ -``మహానటుడు ఎన్టీఆర్ తో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. నేను మద్రాస్ లో చదువుతున్నప్పుడు గుంపులో వెళ్లి ఎన్టీఆర్ ని కలిశా. దాసరి గారి సాయంతో ఎన్టీఆర్ తో నటించే అవకాశం వచ్చింది. 1982లో లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పెట్టినప్పుడు బొబ్బిలి పులి గెటప్ లో ఉన్న అన్నగారు కొబ్బరికాయ కొట్టారు`` అని తెలిపారు.
అన్నయ్యతో కలిసి షిరిడీకి రెండు సార్లు వెళ్లా. అప్పుడు ఏం కోరుకున్నావ్ దేవుడ్ని అని అడిగారు అన్నగారు. మీరు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నా అని చెప్పా. మరి మీరేం కోరుకున్నారు అని అడిగితే చెప్పారు కాని.. అది ఇక్కడ చెప్పకూడదు. రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తి ఒకరో ఇద్దరో ఉంటారు. లంచం అనే మాటకు అర్ధమే తెలియదు ఆయనకు. నందమూరి కుటుంబానికే లంచం అనేది సరిపడదు.. అని అన్నారు.