Begin typing your search above and press return to search.

మోహన్ బాబు క్లాస్ మహిమేనా!!

By:  Tupaki Desk   |   16 Jun 2017 4:36 AM GMT
మోహన్ బాబు క్లాస్ మహిమేనా!!
X
సినిమాలు చేయడం మానేస్తున్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. మంచు మనోజ్ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మంచు హీరో ఇచ్చిన ఈ స్టేట్మెంట్ ఇటు ఇండస్ట్రీతో పాటు.. అటు మంచు ఫ్యాన్స్ కు కూడా షాక్ కొట్టించేసింది. కానీ.. ఇంతలోనే ఆ పోస్ట్ ను డిలెట్ చేసేసి.. తన కొత్త సినిమా గురించి వెరైటీగా చెప్పేందుకు ప్రయత్నించానని అన్నాడు మనోజ్.

అయితే.. మనోజ్ చేసిన ఈ రెండు ట్వీట్స్ కి మధ్యలో పెద్ద స్టోరీనే నడిచిందని ఇండస్ట్రీ జనాలు అంటున్నారు. మనోజ్ నిజంగానే తన ఫీలింగ్ ని వ్యక్తం చేసినా.. లేక కొత్తగా ట్రై చేసినా.. ఈ తరహా ట్వీట్ కి మోహన్ బాబు గట్టిగానే రియాక్ట్ అయ్యారట. ఇన్నాళ్ళూ యాక్టింగ్ చేస్తూ ఒక లెజండరీ పొజిషన్లో ఉన్న మోహన్ బాబు.. ఆయన తనయుడు యాక్టింగ్ చేయను అంటే ఎలా రియాక్ట్ అవుతారు? పైగా చాలా ఏళ్ళ నుండి చక్కగా సినిమా కెరియర్ లో తనకంటూ ఒక ఒరవడి క్రియేట్ చేసుకున్న మనోజ్.. ఇప్పుడు ఏ కారణం చేత వద్దన్నా కూడా.. అది ముందు పబ్లిక్ కు అలా చెప్పేయడం బాలేదని మోహన్ బాబు క్లాసిచ్చారట. ఇండస్ర్టీలోని ఆయన సన్నిహితులు చెబుతున్న దాని ప్రకారం.. మనోజ్ ను వెంటనే ఇంటికి పిలిపించుకున్న మోహన్ బాబు.. అసలు ఇలాంటి ప్రకటనలు తనకు చెప్పకుండా ఇవ్వొద్దనీ.. అలాంటి ప్రకటనలతో కామెడీ చేయొద్దని సున్నితంగా హెచ్చరించారని టాక్.

ఒక వేళ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయనే ఉద్దేశ్యంతో ఇండస్ట్రీ నుంచి రిటైర్ అవాలని భావిస్తే.. సినిమా ఎంపిక నుంచి మిగిలిన విషయాలతో సహా అన్నీ తాను చూసుకుంటానని.. అంతే తప్ప సినిమాలు మానేయడం లాంటి కఠోర నిర్ణయాలు తీసుకోవద్దని మోహన్ బాబు చెప్పారంటూ ఇప్పుడు ఫిలిం నగర్లో టాక్ వినిపిస్తోంది. ఆయన క్లాస్ మహిహతోనే తన ట్వీట్స్ ను డిలెట్ చేసి.. కొత్త ప్రాజెక్టును వెరైటీ ప్రకటిద్దామని ప్రయత్నించానని.. కానీ తన ప్రయత్నం బెడిసికొట్టి వేరేలా జనాలకు అర్ధమైందని మనోజు తిరిగి ట్వీట్లేశాడు. ఏదేమైనా ఎన్టీఆర్ ఏఎన్నార్ తరువాత చిరంజీవి అండ్ మోహన్ బాబు వంటివారే లివింగ్ లెజెండ్స్. వీరిపిల్లలు సినిమాల్లో కంటిన్యూ కాలేం అంటే సినిమా లవర్స్ ఎవరైనా కాస్త హర్టవుతారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/