Begin typing your search above and press return to search.
షాకింగ్ కాంబో : మోహన్ బాబుకు జతగా ఐశ్వర్య
By: Tupaki Desk | 17 May 2019 8:46 AM GMTతమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం చాలా ఏళ్లుగా కలలు కంటున్న ప్రాజెక్ట్ 'పొన్నియన్ సెల్వన్'. ఈ చిత్రంను భారీ బడ్జెట్ తో మణిరత్నం తెరకెక్కించేందుకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన నటీ నటుల ఎంపిక కార్యక్రమం జరుపుతున్నాడు. జయం రవి - మోహన్ బాబు - ఐశ్వర్య రాయ్ ఇంకా ప్రముఖులు ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. ఈ చిత్రం గురించి ప్రస్తుతం తమిళ మీడియాలో ఆసక్తికర కథనం ఒకటి తెగ ప్రచారం జరుగుతోంది. అదేంటి అంటే ఈ చిత్రంలో మోహన్ బాబుకు భార్యగా ఐశ్వర్య రాయ్ కనిపించబోతుందట. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రగా ప్రచారం జరుగుతోంది.
రాజ్యాధికారం కోసం ఎంతకైనా తెగించే పాత్రలో ఐశ్వర్య రాయ్ కనిపించబోతుందని, ఆమె భర్త పాత్రను మోహన్ బాబు పోషించనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మోహన్ బాబు మరియు ఐశ్వర్య రాయ్ కాంబో అంటే అంతా కూడా అవాక్కవుతున్నారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు ఇదో పెద్ద సర్ ప్రైజింగ్ కావడం ఖాయం. ఈ విషయమై ఇంకా ఎలాంటి ప్రకటన అయితే రాలేదు కాని దర్శకుడు మణిరత్నం మాత్రం ఏం చేసినా కూడా ప్రేక్షకులను ఒప్పించగల సమర్ధుడు. అందుకే ఈ షాకింగ్ కాంబోతో కూడా మణిరత్నం ఒప్పించడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
నిన్న మొన్నటి వరకు ఈ చిత్రం బడ్జెట్ ఎక్కువ అవుతున్న కారణంగా లైకా ప్రొడక్షన్స్ వారు ఈ చిత్రంను నిర్మించేందుకు నో చెప్పారని, దాంతో మణిరత్నం మళ్లీ ఈ ప్రాజెక్ట్ కోసం నిర్మాతలను వెదుక్కునే పనిలో పడ్డట్లుగా వార్తలు వచ్చాయి. ఇదే సమయంలో ఆయన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మాత్రం ఆపకుండా నిర్వహిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా ఈ ఏడాది పొన్నియన్ సెల్వన్ చిత్రాన్ని పట్టాలెక్కించాలని మణిరత్నం చాలా పట్టుదలతో ఉన్నాడు. 10వ శతాబ్దం కథాంశంతో ఈ చిత్రం ఉండబోతుంది. ఇంకా ఈ చిత్రంలో ఎన్నో షాకింగ్ కాంబోలు - పాత్రలు కూడా ఉంటాయని తమిళ సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది.