Begin typing your search above and press return to search.
60 ప్లస్ లో బాక్సర్ గా కంప్లీట్ స్టార్ సాహసాలు
By: Tupaki Desk | 11 Nov 2021 1:30 AM GMTమలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్- లెజెండరీ డైరెక్టర్ ప్రియదర్శన్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈ జోడీ కెరీర్ లో ఎన్నో సక్సెస్ ల్ని అందుకున్నారు. ఇప్పుడు `మరక్కర్` తో మరో సంచలనానికి రెడీ అయ్యారు. మలయాళ ఇండస్ట్రీలో తొలి భారీ బడ్జెట్ చిత్రమిది. దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇదొక ఎపిక్ హిస్టారికల్ వార్ డ్రామా నేపథ్యంలోని సినిమా. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాల్ని అంతకంతకు పెంచేస్తున్నాయి. సక్సెస్ అయితే గనుక బాక్సాఫీస్ వసూళ్లపైనా `మరక్కర్` చరిత్ర తిరగరాసిన చిత్రంగా నిలిచిపోతుంది. మాలీవుడ్ ట్రేడ్ నిపుణులు సైతం భారీగానే అంచనాలు పెట్టుకున్నారు.
మలయాళంతో పాటు ఇతర భాషల్లోనూ ఈ చిత్రం అనువాద రూపంలో విడుదల కానుంది. ఆ సంగతి పక్కనబెడితే `మరక్కర్` రిలీజ్ కాకుండానే ఈ ద్వయం మరో ఛాలెంజిగ్ చిత్రం కోసం చేతులు కలిపారు. బాక్సింగ్ నేపథ్యంలో ప్రియదర్శన్ ఓ చిత్రం ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది . ఇందులో మోహన్ లాల్ బాక్సర్ గా కనిపించనున్నారు. దానికి సంబంధించిన వర్కౌట్ల సెషన్ కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ట్విటర్ వేదికగా మోహన్ లాల్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తోన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో మోహన్ లాల్ ట్రైనర్ సమక్షంలో బాక్సింగ్ లో తర్పీదు పొందుతున్నారు.
ట్రైనర్ పైనే పంచ్ లు విసురుతూ జిమ్ములో పరుగులు పెట్టిస్తున్నారు. మోహన్ లాల్ లాంటి సీనియర్ నటుడు వయసుతో సంబంధ లేకుండా ఇలాంటి ఛాలెంజింగ్ రోల్స్ చేయడం విశేషం. ప్రస్తుతం ఆయన వయసు 60 ఏళ్లు దాటింది. కానీ 30 కుర్రాడిలా కసరత్తులు చేస్తూ...చాలెజింగ్ పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నారు. తాజాగా బాక్సర్ గానూ మెప్పించడానిక రెడీ అవుతోన్న మోహన్ లాల్ నేటి తరానికి ఎంతో ఇనిస్పెరేషన్ గా చెప్పొచ్చు. ప్రస్తుతం ఆయన చేతిలో ఏడేనిమిది సినిమాలున్నాయి. వాటిలో కొన్ని షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నాయి. ఇక తెలుగులో విజయ్ దేవరకొండ- వరుణ్ తేజ్ లాంటి యువహీరోలు బాక్సర్లుగా నటిస్తున్నారు. వీళ్లతో పోటీపడుతూ లాల్ లాంటి వాళ్లు బరిలో నిలవడం ఆశ్చర్యకరం. బాలీవుడ్ లో అమితాబ్... కోలీవుడ్ లో రజనీకాంత్.. టాలీవుడ్ లో చిరంజీవి 60 ప్లస్ వయసులోనూ దుమ్ము రేపుతున్న సంగతి తెలిసిందే. మలయాళం నుంచి లాల్ సత్తా చాటుతున్నారు.