Begin typing your search above and press return to search.

యాక్ష‌న్ కింగ్ తో కంప్లీట్ స్టార్

By:  Tupaki Desk   |   26 Feb 2023 11:36 AM GMT
యాక్ష‌న్ కింగ్ తో కంప్లీట్ స్టార్
X
కంప్లీట్ స్టార్ మోహ‌న్ లాల్ మాలీవుడ్లో ఏడాదికి క‌నీసం ఆరు సినిమాలైనా రిలీజ్ అయ్యేలా చూసుకుంటారు. అక్క‌డి ఇండ‌స్ర్టీలో వేగంగా సినిమాలు చేసి..రిలీజ్ చేయ‌డం ఆయ‌న‌కే చెల్లింది. ఇలా అక్క‌డ సినిమాలు చేస్తూనే ఇత‌ర భాష‌ల్లో కీల‌క పాత్ర‌ల్లో అవ‌కాశాలు వ‌స్తే న‌టిస్తుంటారు. ఆర‌కంగా మెహ‌న్ లాల్ ఇండియాలోనే బిజీగా ఉండే న‌టుడు. రేయింబ‌వ‌ళ్లు షూటింగ్ ల్లో పాల్గొంటారు.

ఒక‌ప్పుడు సూప‌ర్ స్టార్ కృష్ణ‌..ఎన్టీఆర్..ఏఎన్నార్ లాంటి దిగ్గ‌జాలు మాత్ర‌మే ఇలా టెమ్ షెడ్యూల్ కేటాయించేవారు. ఆ త‌ర్వాత త‌రం న‌టుల్లో మోహ‌న్ లాల్ పేరు మాత్ర‌మే వినిపిస్తుంది. ఇప్పుడున్న హీరోలు ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయ‌డ‌మే గ‌గ‌నం అయిపోయింది. తాజాగా ఇంత బిజీలోనూ మోహ‌న్ లాల్ యాక్ష‌న్ కింగ్ అర్జున్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌డానికి ప‌చ్చ జెండా ఊపిన‌ట్లు తెలుస్తోంది.

ఈ విష‌యాన్ని స్వ‌యంగా అర్జున్ రివీల్ చేసారు. క‌థ విష‌యంలో ఇప్ప‌టికే ఇద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ జ‌రిగింద‌న్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుంది అన్న వివ‌రాలు మాత్రం తెల‌ప‌లేదు. కానీ ఈ సినిమా కొన్ని వాస్త‌వ సంఘ‌ట‌ల్ని ఆధారంగా చేసుకుని తెర‌కెక్కిస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. దేశంలోనే సంచ‌ల‌నంగా మారిన ఓ అంశాన్ని బేస్ చూసుకున్న‌ట్లు స‌మాచారం.

అదేంట‌న్న‌ది అధికారికంగా రివీల్ చేస్తే గానీ క్లారిటీ రాదు. అర్జున్ కొంత కాలంగా న‌టుడిగా కంటే ద‌ర్శ‌కుడిగానే కొన‌సాగుతున్నారు. ఆర‌కంగా మోహ‌న్ లాల్ తో ముందుకెళ్తు న్నారు. ఇక ఈ ద్వ‌యం గ‌తంలో `మ‌రక్క‌ర్` చిత్రంలో క‌లిసి న‌టించారు.

ఇది భారీ బ‌డ్జెట్ తో నిర్మించిన చిత్రం..సాంకేతిక అంశాల్ని హైలైట్ చేసారు. కానీ బాక్సాఫీస్ వ‌ద్ద అంచ‌నాలు అందుకోలేదు. ప్ర‌స్తుతం మోహ‌న్ లాల్ ప‌లు సినిమాల్లో న‌టిస్తూనే ఆయ‌న స్వీయా ద‌ర్శ‌క‌త్వంలో `బ‌ర్రోజీస్` ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటిగ్ క్లైమాక్స్ కి చేరింది. అన్ని ప‌నులు పూర్తి చేసి వేస‌వికి విడుద‌ల చేయాలని చూస్తున్నారు.