Begin typing your search above and press return to search.

మోహన్ లాల్‌ ను యేలేటి ఎలాచూపిస్తున్నాడంటే

By:  Tupaki Desk   |   16 Feb 2016 11:30 AM GMT
మోహన్ లాల్‌ ను యేలేటి ఎలాచూపిస్తున్నాడంటే
X
తెలుగులో వైవిధ్యమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ చంద్రశేఖర్ యేలేటి. ‘ఐతే’ దగ్గర్నుంచి ‘సాహసం’ వరకు చాలా వైవిధ్యమైన సినిమాలు చేశాడు యేలేటి. ‘సాహసం’ తర్వాత దాదాపు మూడేళ్లు గ్యాప్ తీసుకుని.. ఇప్పుడు ‘మనమంతా’ అనే మరో వెరైటీ సినిమాతో రెడీ అవుతున్నాడీ టాలెంటెడ్ డైరెక్టర్. తన గత సినిమాలకు భిన్నంగా ఈసారి అతను ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేస్తుండటం విశేషం. ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటన్నది తెలియడం లేదు కానీ.. ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న మోహన్ లాల్ కు సంబంధించి మాత్రం ఓ ఆసక్తికర విషయం వెల్లడైంది.

మోహన్ లాల్ ఇందులో సూపర్ మార్కెట్ లో పని చేసే షాప్ కీపర్ గా నటిస్తున్నాడట. దీనికి సంబంధించి హింట్ ఇస్తూ షూటింగ్ సందర్భంగా తీసిన ఓ వర్కింగ్ స్టిల్ బయటికి వదిలారు. సూపర్ మార్కెట్ లో సామాన్యుడి పాత్రలో కనిపిస్తున్నాడు మోహన్ లాల్. డైరెక్టర్ యేలేటి ఆయనకు సూచనలిస్తున్నాడు. మోహన్ లాల్ లాంటి నటుడు తెలుగులో ఓ సినిమా ఒప్పుకుని చేస్తున్నాడంటే ఈ సినిమాలో ఏదో ఒక విశేషం ఉండే ఉంటుంది. గౌతమి - ఊర్వశి లాంటి సీనియర్ ఆర్టిస్టులతో పాటు బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కూడా ఇందులో ఓ ముఖ్య పాత్ర పోషిస్తుండటం విశేషం. అభిరుచి ఉన్న నిర్మాతగా పేరు తెచ్చుకున్న సాయి కొర్రపాటి ‘మనమంతా’ను నిర్మిస్తున్నాడు. మేలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుంది.