Begin typing your search above and press return to search.
అందుకే మోహన్ లాల్ అంత గ్రేట్ అయ్యాడు
By: Tupaki Desk | 6 Aug 2016 9:37 AM GMTమోహన్ లాల్ గురించి వేరే ఇండస్ట్రీల వాళ్లు కూడా చాలా గొప్పగా చెబుతుంటారు. మన అగ్ర నిర్మాత సురేష్ బాబు అయితే.. మన ఇండస్ట్రీలో నాకెవ్వరూ నచ్చరు.. మోహన్ లాల్ అంటే మాత్రం పిచ్చి అంటుంటారు. ఐతే అప్పట్లో కొన్ని డబ్బింగ్ సినిమాల్లో లాల్ ను చూశాం కానీ.. నేరుగా అతను ఓ తెలుగు సినిమాలో నటిస్తే చూసే భాగ్యం.. అతడి నటనలోని గొప్పదనం గురించి తెలుసుకునే అవకాశం తెలుగు ప్రేక్షకులకు దక్కలేదు. ఐతే నటుడిగా అరంగేట్రం చేసిన పాతికేళ్ల తర్వాత తెలుగులో నేరుగా ‘మనమంతా’ సినిమాలో నటించి ఆశ్చర్యపరిచాడు. యేలేటి ఏరికోరి మోహన్ లాల్ నే ఎందుకు ఈ సినిమాకు ఎంచుకున్నాడు.. మోహన్ లాల్ కూడా ఇలాంటి ఓ చిన్న సినిమాను ఎందుకు ఒప్పుకున్నాడు అన్నది సినిమా చూస్తే అర్థమవుతుంది.
తెర మీద ఓ పాత్ర నటిస్తున్నట్లు కాకుండా జీవించినట్లు కొన్నిసార్లే అనిపిస్తుంది. నటుడు కాకుండా పాత్ర మాత్రమే కనిపించడం.. ఆ పాత్రతో కలిసి మనం ట్రావెల్ చేయడం అన్నది అన్నిసార్లూ జరగదు. అలా ప్రేక్షకుల్ని ఒప్పించి మెప్పించగలిగినపుడే ఓ నటుడి గొప్పదనం తెలుస్తుంది. మోహన్ లాల్ ‘మనమంతా’లో అలాగే చేశాడు. సినిమా మొదలైన కాసేపటికే అక్కడ ఉన్నది మోహన్ లాల్ అన్న సంగతి మరిచిపోతాం. సాయిరాం మాత్రమే కనిపిస్తాడు. ఎక్కడా నటిస్తున్నట్లు కనిపించదు. బిహేవ్ చేస్తున్నట్లు మాత్రమే ఉంటుంది. హడావుడి లేకుండా సహజంగా నటించి.. ప్రేక్షకుల్ని కట్టిపడేశాడు మోహన్ లాల్. ద్వితీయార్ధంలో ఎమోషనల్ సీన్స్‌లో మోహన్ లాల్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. పాత్రకు సంబంధించిన సంఘర్షణను తన కళ్లతోనే అద్భుతంగా పలికించాడు మోహన్ లాల్. అతనెందుకు అంత గొప్ప నటుడయ్యాడో.. ‘ది కంప్లీట్ యాక్టర్’ అని ట్యాగ్ వేయించుకున్నాడో ‘మనమంతా’ సినిమా చూస్తే అర్థమవుతుంది.