Begin typing your search above and press return to search.
హాలీవుడ్ హీరోలా మారిన సూపర్ స్టార్
By: Tupaki Desk | 21 Feb 2018 9:33 AM GMTకంప్లీట్ యాక్టర్ అని మోహన్ లాల్ ని ఊరికే అనరు. తను పోషించే పాత్రకు తగ్గట్టు తనను తాను మలుచుకునే విధానం ఇప్పటి యువ హీరోలకు కూడా స్పూర్తివంతంగా ఉంటుంది. తన కొత్త సినిమాల కోసం భారీ కాయాన్ని తగ్గించుకున్న మోహన్ లాల్ కుర్రాడిలా మారిన ఫోటోలు గతంలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ప్రస్తుతం మోహన్ లాల్ నటిస్తున్న కొత్త సినిమా కయంకులం కొచ్చున్ని. ఇది నేషనల్ హై వేల మీద దొంగతనాలు చేసే ఒక సుప్రసిద్ధ బందిపోటు దొంగ పేరు. కాని అది పోషిస్తోంది మోహన్ లాల్ కాదు. ప్రేమమ్ ఫేం నివిన్ పౌలీ. మోహన్ లాల్ అందులో ఇతిక్కార పక్కి అనే మరో సీనియర్ దొంగ పాత్రను చేస్తున్నాడు. క్యామియోగా ఉండే ఈ పాత్ర సినిమా మొత్తం ఉండదు. కాని దానికి సంబంధించిన స్టిల్స్ మాత్రం ఇప్పుడు టాక్ అఫ్ ది ఇండస్ట్రీ గా మారాయి.
ఈ కొచ్చున్ని గురించి చాల కథలే ప్రచారంలో ఉన్నాయి. శతాబ్దం వెనుక జరిగిన కాలానికి తీసుకెళ్ళి మరీ ఈ సినిమాలో చూపించబోతున్నారు. పెద్దలను దోచుకుని పేదలకు పంచిపెట్టు అనే రాబిన్ హుడ్ సిద్ధాంతాన్ని పాటించిన కొచ్చున్నిని దేవుడిగా కొలిచే ప్రాంతాలు కేరళలో చాలా ఉన్నాయి. కొచ్చున్నికి మార్గదర్శిగా - గురువుగా దొంగతనాలు ఎలా చేయాలో చూపించే గైడ్ గా మోహన్ లాల్ విభిన్న ఆహార్యంతో 40 నిమిషాల పాటు ఈ సినిమాలో కనిపించనున్నాడు. యూత్ ఐకాన్ నవీన్ పౌలి - కంప్లీట్ స్టార్ మోహన్ లాల్ మొదటిసారి చేస్తున్న కాంబో కాబట్టి విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది ఈ మూవీ.
మోహన్ లాల్ గెటప్ అప్పుడెప్పుడో చూసిన గ్లాడియేటర్ లోని రసెల్ క్రో ని పోలి ఉండటంతో అందరు అదే పోలిక గురించి మాట్లాడుతున్నారు. కాని దర్శకుడు రోషన్ ఆండ్రూస్ మాత్రం పూర్తి రీసెర్చ్ చేసి అప్పుడు దొంగలు ఎలా ఉంటారో తెలుసుకుని మరీ కాస్ట్యూమ్స్ చేయించామని, ఆ లుక్ లో కనిపించడం కాకతాళీయం అంటున్నారు. దీనికి ఎడిటర్ మన తెలుగువాడే. అక్కినేని శ్రీకర్ ప్రసాద్.