Begin typing your search above and press return to search.
ఇదీ మోహన్ లాల్ ప్రేమ - పెళ్లి కథ!
By: Tupaki Desk | 25 July 2016 4:25 AM GMTరొమాంటిక్ రోల్స్ లో ఇట్టే ఒదిగిపోయే నటుడిగా మోహన్ లాల్ కు మంచి పేరు ఉంది. ఆన్ స్క్రీన్ పై హీరోయిన్లతో చక్కని కెమిస్ట్రీ ఆయనకి కుదురుతుందని దర్శకులు ప్రశంసిస్తూ ఉంటారు. అయితే, ఆఫ్ స్క్రీన్ లో కూడా మోహన్ లాల్ మాంచి రొమాంటిక్ పర్సన్ కాబట్టే... అదే తెర మీద ప్రతిఫలిస్తుందని చెప్పేవారూ లేకపోలేదు. అంటే, ఆయనకి ఎఫైర్లు ఉన్నాయని అపార్థం చేసుకోకండి! ఈ మధ్యనే కాలికట్ వెళ్లిన మోహన్ లాల్ తన జీవితంలోని రొమాంటిక్ యాంగిల్ ను మీడియాతో పంచుకున్నారు. ఆయన పెళ్లి ఎలా జరిగిందీ... ఆయన కోసం తన భార్య సుచిత్ర ఎంతగా ఎదురు చూసిందీ... ఆ ఎదురుచూపుల్ని అర్థం చేసుకోవడానికి తనకెంత సమయం పట్టిందీ.. ఇలాంటి విషయాల్నీ పూసగుచ్చినట్టు చెప్పారు మోహన్ లాల్.
1986తో మోహన్ లాల్ కీ - సుచిత్రకీ పెళ్లి అనే ప్రస్థావన వచ్చిందట! రెండు కుటుంబాలకు చెందినవారూ సంబంధం ఓకే అనుకున్నారు. ఇద్దరీ జోడీ బాగుందీ, పెళ్లి చేసేద్దాం అనుకున్నారు. కానీ, అనూహ్యంగా ఓ సమస్య వచ్చింది. దాంతో వీరి పెళ్లి ప్రస్థావన అక్కడితో ఆగిపోయింది. ఇంతకీ ఆ సమస్య ఏంటంటే... జాతకాలు! మోహన్ లాల్ - సుచిత్రల జతకాలు కుదరడం లేదని ఎవరో చెప్పడంతో ఆ పెళ్లి ప్రస్థావన అక్కడితో విరమించుకున్నారు మోహన్ లాల్. అయితే, సుచిత్ర మాత్రం మౌనంగా మోహన్ ను ప్రేమిస్తూనే ఉన్నారట. ఆ విషయం తెలియడానికి చాలారోజులే పట్టిందిట.
తరువాత, వరుస సినిమాలతో బిజీబిజీగా మారిపోయింది మోహన్ లాల్ లైఫ్. దాంతో సుచిత్రతో పెళ్లి చూపుల వ్యవహారం దాదాపు మరచిపోయానే అనుకోవాలి. అయితే, కొన్నాళ్లకి షూటింగ్ కోసం కాలికట్ వెళ్లారు. అక్కడ ఓ ఫ్రెండ్ ఇంట్లో మోహన్ లాల్ బస చేశారు. అక్కడే అసలు విషయం ఆయనకి తెలిసింది. తన కోసం రెండు సంవత్సరాలుగా సుచిత్ర ఎదురుచూస్తోందనీ, మూగగా తననే ప్రేమిస్తోందన్న విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు. తనను ఇంతగా ప్రేమిస్తున్న వ్యక్తిని దూరం చేసుకోవడం సరికాదని అనిపించింది. ఏ నిర్ణయమూ తీసుకోలేక సతమతమౌతున్న సమయంలో మూగాంబికా అమ్మవారి ఆలయానికి వెళ్లారు. ఇదే విషయం ఆలోచిస్తూ ఉండగా... అనూహ్యంగా అదే దేవాలయంలో సుచిత్ర కనిపించింది. అంతే, దైవ నిర్ణయం కాబట్టే మళ్లీ సుచిత్ర తన ముందుకు వచ్చిందని వెంటనే పెళ్లికి సిద్ధపడ్డారు. ఆ తరువాత వారి పెళ్లి జరిగింది. ఇప్పుడు వారికి ఇద్దరు పిల్లలు... ప్రణవ్, విస్మయ. సో.. హ్యాపీ ఫ్యామిలీ. ఆయన రియల్ లైఫ్ లో ఇంత అందమైన ప్రేమకథ ఉంది, కాబట్టి రీల్ లైఫ్ లో కూడా అలాంటి సన్నివేశాల్లో మోహన్ లాల్ జీవించేస్తుంటారన్నమాట!