Begin typing your search above and press return to search.

5 వేల స్క్రీన్ల‌లో పాన్ ఇండియా ట్రీట్

By:  Tupaki Desk   |   1 Jan 2020 2:51 PM GMT
5 వేల స్క్రీన్ల‌లో పాన్ ఇండియా ట్రీట్
X
పాన్ ఇండియా సినిమాల రేంజ్ అన్నివేళ‌లా హాట్ టాపిక్. దాదాపు నాలుగైదు భాష‌ల్లో రిలీజ్ చేస్తుండ‌డంతో అంతే భారీగా థియేట‌ర్ల‌ను రెడీ చేయాల్సి ఉంటుంది. దాదాపు 10వేల స్క్రీన్ల‌లో రిలీజ్ చేసి సంచ‌ల‌నం సృష్టించారు బాహుబ‌లి మేక‌ర్స్. ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే అత్యంత భారీ రిలీజ్ ఇది. అమీర్ ఖాన్ `థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్` స‌హా ప‌లు పాన్ ఇండియా కేట‌గిరీ చిత్రాల్ని 5000 స్క్రీన్లు అంత‌కుమించిన స్క్రీన్ల‌లో రిలీజ్ చేశారు. 2019లో భారీ పాన్ ఇండియా చిత్రాలు సైరా- సాహో అదే రేంజులో రిలీజయ్యాయి. త్వ‌ర‌లో బాలీవుడ్ లో పాన్ ఇండియా కేట‌గిరీలో తెర‌కెక్కుతున్న పానిప‌ట్ .. తానాజీ 3డి లాంటి చిత్రాలు పాన్ ఇండియా కేట‌గిరీలో భారీగానే రిలీజ్ కానున్నాయి.

అయితే ఈ రేస్ లోకి మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహన్ లాల్ కూడా చేరారు. లాల్ క‌థానాయ‌కుడిగా ప్రియ‌ద‌ర్శ‌న్ తెర‌కెక్కిస్తున్న మ‌ర‌క్కార్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా దాదాపు 5000 స్క్రీన్ల‌లో రిలీజ్ కానుంది. ఆ మేర‌కు మేక‌ర్స్ అధికారికంగా ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసి ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించారు. మ‌ల‌యాళం-తెలుగు-త‌మిళం-క‌న్న‌డం- హిందీలో ఈ చిత్రాన్ని అత్యంత భారీగా రిలీజ్ చేయ‌నున్నారు.

మ‌ర‌క్కార్ చిత్రాన్ని ఆశీర్వాద్ సినిమాస్ ప‌తాకంపై పెరంబవూర్ నిర్మిస్తున్నారు. కీర్తి సురేష్ - నాగార్జున స‌హా ప‌లువురు స్టార్లు ఈ చిత్రంలో న‌టించారు. మార్చి 26న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్ప‌టివ‌ర‌కూ మ‌ల‌యాళంలో హైయ్యెస్ట్ బ‌డ్జెట్ చిత్ర‌మిదేనంటూ ప్ర‌చారం సాగుతోంది.