Begin typing your search above and press return to search.
ఇలా ఎలా సాధ్యం లాల్ గారు
By: Tupaki Desk | 9 Jan 2018 7:08 AM GMTఅనుకుంటాం కాని సినిమాకు హీరో అయినంత ఈజీ కాదు స్టార్ డం నిలబెట్టుకోవడం. ఎంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో అయినా తన అభిమానులకు, ప్రేక్షకులకు ఏం కావాలో, తనను వాళ్ళు ఎలా చూడాలని కోరుకుంటున్నారో అంచనా వేసుకుని దానికి తగినట్టు సిద్ధం కాకపోతే ఎక్కువ కాలం మన్నడం కష్టం. అలాంటి వాళ్ళలో ముందు వరసలో ఉండేందుకు పోటీ పడే హీరోల్లో మోహన్ లాల్ ఒకరు. కంప్లీట్ యాక్టర్ అనే బిరుదుకి సార్ధక నామధేయులుగా నిలిచే మోహన్ లాల్ మునుపటి ఏడాది జనతా గ్యారేజ్, మనమంతా స్ట్రెయిట్ తెలుగు సినిమాలు చేసి మంచి పేరు, సక్సెస్ అందుకున్నది చూసాం. తెలుగు రాకపోయినా మనమంతా సినిమాకు నేర్చుకుని, పట్టుబట్టి మరీ డబ్బింగ్ చెప్పడం చూసి చాలా మందికి నోట మాట రాలేదు.
మలయాళంలో ఇప్పటికీ అశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మోహన్ లాల్ ప్రస్తుతం తాను చేస్తున్న కొత్త చిత్రం కోసం పూర్తిగా మేకోవర్ చేసుకోవడం మల్లువుడ్ తో పాటు అన్నిచోట్లా చర్చనీయాంశం అయ్యింది. కథ డిమాండ్ పరంగా యంగ్ గా కనిపించడం కోసం తన బరువును పదిహేను కిలోలకు పైగా తగ్గించుకుని తన మొహానికి ఆకర్షణగా నిలిచే బుగ్గలని కూడా కుంచించుకుని పూర్తిగా కొత్త లుక్ లోకి మారిపోయిన మోహన్ లాల్ ని చూచి శెభాష్ అనని వారు లేరు. మరి 57 ఏళ్ళ వయసులో ఇంత కమిట్మెంట్ చూపిస్తే అనకుండా ఉంటారా.
పైన చూస్తున్న ఫోటోలో మోహన్ లాల్ కు ట్రైన్ అప్ లో సహాయం చేస్తున్నది ఆయన వారసుడు ప్రణవ్. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో త్వరలో తెరంగేట్రం చేయబోతున్న్ ప్రణవ్ కు తండ్రి దగ్గరుండి మెలకువలు నేర్పించడం చూస్తే ఎంత ముచ్చటగా ఉందో కదా. ఇప్పుడు ఈ పిక్ సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. అబ్బాయి కంటే నాన్నే యంగ్ గా కనిపిస్తున్నాడు అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.