Begin typing your search above and press return to search.
పొరుగు హీరోల పప్పులుడకవు
By: Tupaki Desk | 16 Dec 2018 5:30 PM GMTఇరుగు పొరుగు భాషల సినిమాలు టాలీవుడ్ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఇటీవల ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి సిరీస్ సక్సెస్ తర్వాత పరిణామమిది. మన సినిమాలు ఇరుగు పొరుగు భాషలకు వెల్లువెత్తడం పెరిగింది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో తమిళం - మలయాళ - కన్నడ చిత్రాల హవా అంతకంతకు పెరుగుతోంది. తమిళ హీరోలు రజనీకాంత్ - కమల్ హాసన్ - సూర్య - కార్తీ - విశాల్ - అజిత్ - విక్రమ్ - విజయ్ .. నటించిన తమిళ చిత్రాలు తెలుగులోనూ రిలీజవుతున్నాయి. తమిళ ఫ్లేవర్ చాలా సార్లు ఫెయిలవుతున్నా.. కొన్ని సార్లు ఏదో ఒక మ్యాజిక్ జరిగి బాక్సాఫీస్ వద్ద నెగ్గుకొస్తున్నారు. ఇటీవల విశాల్ నటించిన సినిమాల సక్సెస్ ఆ కోవలోనిదే. సూర్యకు గజిని సక్సెస్ తర్వాత తెలుగు మార్కెట్ సంగతి తెలిసిందే. ఇటీవల కొన్ని సినిమాలు ఫెయిలైనా.. తెలుగు రాష్ట్రాల్లో హవా చాటేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. విక్రమ్, అజిత్ మన మార్కెట్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. వీళ్లతో పాటే రేసులోకి వచ్చాడు విజయ్. ఇటీవల మెర్సల్ సినిమాతో తెలుగులోనూ బంపర్ హిట్ కొట్టాడు. అటుపై సర్కార్ చిత్రంతోనూ తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేశాడు. సూర్య - కార్తీ లకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంత ఇమేజ్ ఇతర హీరోలకు లేదు. చియాన్ విక్రమ్ - కమల్ హాసన్ ఇమేజ్ ఇటీవల వర్కవుట్ కావడం లేదు. అయితే వీళ్లంతా తెలుగు రాష్ట్రాల ప్రమోషన్స్ కి రెగ్యులర్ గా విచ్చేస్తూ.. మన జనాలకు దగ్గరవ్వడం కొంత ప్లస్.
కన్నడ - మలయాళ హీరోలు ఇటీవల మన మార్కెట్లపై కన్నేయడం కొత్త పరిణామం. ఎన్టీఆర్- జనతా గ్యారేజ్ చిత్రంలో నటించిన మోహన్ లాల్ ప్రస్తుతం టాలీవుడ్ మార్కెట్ పై కన్నేశారు. జనతా గ్యారేజ్ .. ఆ తర్వాత మన్యం పులి - కనుపాప వంటి చిత్రాలతో మోహన్ లాల్ కి మంచి పేరొచ్చింది. బాక్సాఫీస్ వద్ద `మన్యం పులి` విజయం దక్కించుకోవడంతో అతడిలో కాన్ఫిడెన్స్ పెరిగింది. ప్రస్తుతం మోహన్ లాల్ నటించిన ఓడియెన్ మలయాళంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ రిలీజైంది. అయితే అటు మలయాళంలో కానీ, తెలుగులో కానీ ఈ సినిమాకి ఎక్కడా పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రాలేదు. సినిమాకి ఓపెనింగులు బావున్నాయన్న టాక్ వినిపించినా కంటెంట్ పరంగా ఆశించిన స్థాయిలో పాజిటివ్ టాక్ రాలేదు. అయినా మోహన్ లాల్ తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం చేసుకునేందుకు తపిస్తున్నారు. సూర్య - కార్తీ తరహాలో లాల్ తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ - విశాఖ లాంటి ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ప్రచారం చేసేందుకు వెళుతున్నారు. అతడు ఎంత ప్రచారం చేసినా.. పాజిటివ్ టాక్ లేని సినిమా హిట్టెక్కించడం కష్టం. పైగా అర్థం కాని మలయాళ టైటిల్ తో తెలుగు ఆడియెన్ లో అంతగా ప్రభావం చూపించలేకపోవడం ఓ పెద్ద మైనస్. ఇక మోహన్ లాల్ తరహాలోనే కన్నడ హీరో యశ్ సైతం తెలుగులోనూ ప్రభావం చూపించాలని ఉత్సాహంలో ఉన్నాడు. అతడు నటించిన కె.జి.ఎఫ్ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనూ వారాహి చలనచిత్రం అండదండలతో భారీగా రిలీజవుతోంది. ఈ సందర్భంగా తెలుగు మీడియాతో యశ్ ఇంటరాక్ట్ కానున్నారని తెలుస్తోంది. మరి పొరుగు హీరోల పప్పులు ఇక్కడ ఎంత వరకూ ఉడుకుతాయి? అన్నదాంట్లో ఎలాంటి స్పష్టత లేదు.