Begin typing your search above and press return to search.
టీజర్ టాక్ : ఒడియన్ భలే ఉందే
By: Tupaki Desk | 15 Dec 2017 7:24 AM GMTమళయాళ స్టార్ హీరో మోహన్ లాల్ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితుడు. ఈమధ్య కాలంలో జనతా గ్యారేజ్.. మనమంతా సినిమాలతో టాలీవుడ్ లో కనిపించారు. ఆ తరవాత ఆయన నటించిన కనుపాప.. మన్యం పులి సినిమాలు తెలుగులోకి డబ్ అయి బాక్సాఫీస్ ను బాగానే ఆకట్టుకున్నాయి. మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాత్ర కోసం ఆయన ఎంత కష్టపడతారు అనేది తాజాగా నటించిన ఒడియన్ సినిమా అద్దం పడుతుంది.
మళయాళ చిత్ర పరిశ్రమలో భారీ బడ్జెతో తెరకెక్కుతున్న చిత్రం ఒడియన్. ఇందులో మోహన్ లాల్ మాణిక్కన్ ఒడియన్ గా కనిపించనున్నారు. ఒడియన్ అనేది ఓ కల్పిత జీవి. సగం మనిషి.. సగం జంతువు రూపంలో ఉండి అతీంద్రియ శక్తులున్న మనుషులు అడవుల్లో రాత్రివేళ సంచరించేవారన్నది కేరళలోని మలబార్ ప్రాంత ప్రజల నమ్మకం. కేరళ జానపదాల్లో ఒడియన్ల పేరు బాగా వినిపిస్తుంది. అలాంటి ఓ వ్యక్తి జీవిత కాలంలో జరిగిన సంఘటనలతో ఒడియన్ సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది. నైట్ ఎఫెక్ట్ లో ఉన్న ఫొటో ప్రేమ్ లోకి ఉన్నట్టుండి మోహన్ లాల్ వచ్చి గంభీరంగా డైలాగులు చెప్పి వెళ్లిపోతారు. రొటీన్ గా ఉండే టీజర్ల కు డిఫరెంట్ గా సాగుతుంది. చివర్లో వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ గా అనిపిస్తుంది.
ఈ సినిమాలో యంగ్ ఒడియన్ గా కనిపించడం కోసం మోహన్ లాల్ 50 రోజుల్లో 20 కిలోల బరువు తగ్గడం విశేషం. ఆయన కొత్తలుక్ చూసిన అభిమానులంతా ఆనాటి మోహన్ లాల్ ను చూసినట్టుందని తెగ ఖుషీ అయిపోతున్నారు. ఒడియన్ మూవీని వి.ఎ. శ్రీకుమార్ డైరెక్ట్ చేస్తున్నారు. మంజు వారియర్.. ప్రకాష్ రాజ్ కూడా ఇందులో నటిస్తున్నారు. ఈ సినిమా మార్చిలో థియేటర్లకు వచ్చే అవకావశముంది.