Begin typing your search above and press return to search.

జనతా పెదనాన్న సైకిల్ పై ఊరంతా..

By:  Tupaki Desk   |   22 March 2017 2:06 PM GMT
జనతా పెదనాన్న సైకిల్ పై ఊరంతా..
X
'మనమంతా' సినిమాతో డైరక్టు తెలుగు సినిమా చేసేసి తెలుగువారికి దగ్గరైన మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్.. 'జనతా గ్యారేజ్' సినిమాతో టాప్ రేంజ్ పెర్ఫామెన్స్ కూడా చూపించేశాడు. అయితే ఈ జనతా గ్యారేజ్ పెదనాన్న మొన్న కేరళ క్యాపిటల్ లో ఏం చేశాడో తెలుసా? తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే.

సరదాగా అనుకోండి లేదా ఆరోగ్యం కోసం అనుకోండి.. ఎందుకోగాని మోహన్ లాల్ కు కేరళ రాజధాని త్రివేండ్రమ్ వీదుల్లో సైకిల్ తొక్కాలనే కోరిక పుట్టేసింది. మరి వెంటనే ఆయన సైకిల్ వేసుకుని బయలుదేరితే.. వెనుకనే లక్షలమంది అభిమానులు కూడా వచ్చేస్తారు. అందుకే కాస్త సంశయించిన మోహన్ లాల్.. చివరకు ఉదయం 4 గంటలకు సైకిల్ తొక్కుదాం అని ఫిక్సయ్యాడు. తొక్కేశాడు. అయితే అప్పుడు కూడా కొందరు ఫ్యాన్స్ అది గమనించి ఆయన ఫోటోలు తీయగా.. ఇవాళ అదే విషయం ఒక ఇంగ్లీషు పత్రిక ప్రచురించింది. దానితో మ్యాటర్ బయటకొచ్చేసింది.

ఏదేమైనా కూడా.. అంత పెద్ద స్టార్ అయ్యుండీ కూడా చక్కగా మోహన్ లాల్ అలా సైకిల్ తొక్కుతుంటే.. అబ్బో ఆ సింప్లిసిటీయే వేరు అన్నట్లుంది. త్వర్లోనే ''1971: భారత సరిహద్దు'' అనే బైలింగువల్ సినిమాతో తెలుగులో మరోసారి తన నటవిశ్వరూపం చూపించనున్నాడు మోహన్ లాల్. ఈ సినిమాలో అల్లు శిరీష్‌ మరో ముఖ్య భూమికను పోషిస్తున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/