Begin typing your search above and press return to search.

గ్యారేజ్ టీంకి షాకిచ్చిన మలయాళ స్టార్

By:  Tupaki Desk   |   21 March 2016 3:30 PM GMT
గ్యారేజ్ టీంకి షాకిచ్చిన మలయాళ స్టార్
X
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కొన్ని విషయాల్లో చాలా పక్కాగా ఉంటారు. తాజాగా కళాభవన్ మణి మరణించినపుడు.. అతనికి నివాళిగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలోనూ బోలెడు రాజకీయాలు చేసేశాడు మోహన్ లాల్. ప్రస్తుతం మల్లూవుడ్ లో టాప్ స్టేజ్ లో ఉండడంతో.. ఆయన చెప్పింది చెప్పినట్లు చేయాల్సిన పరిస్థితి అక్కడ. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ లో నటిస్తున్న మోహన్ లాల్.. ఆ మూవీ నిర్మాతలకు భారీ షాక్ నే ఇచ్చాడు.

జనతా గ్యారేజ్ లో నటించేందుకు మోహన్ లాల్ తో చేసుకున్న రెమ్యూనరేషన్ అగ్రిమెంట్ ఏంటో తెలుసా.. కోటిన్నర రూపాయలు ప్లస్ మలయాళ రైట్స్ ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనికి నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఒప్పుకుంది. వీళ్ల అంచనా ప్రకారం మలయాళ రైట్స్ రూపంలో 1.5 కోట్లు వస్తాయని భావించారు. కానీ ఇప్పుడు జనతా గ్యారేజ్ మలయాళ డబ్బింగ్ రైట్స్ ని అమ్మేశాడు మోహన్ లాల్.

ఈమూవీ మలయాళ హక్కులు ఏకంగా 4.5 కోట్ల రూపాయలు పలకడంతో.. మైత్రి సంస్థకు షాక్ తగిలింది. అంటే.. ఒక్క సినిమాతో 6 కోట్లు జేబులో వేసుకున్నాడన్న మాట మోహన్ లాల్. అఫ్ కోర్స్ తన తెలివితేటలనే వాడినా.. మరీ ఈ రేంజ్ లో గ్యారేజ్ టీంకి షాక్ ఇవ్వడం మాత్రం అశ్చర్యకరమే.