Begin typing your search above and press return to search.
మెగాస్టార్ 'లూసిఫర్' ప్రస్తుత పరిస్థితి ఏంటి..?
By: Tupaki Desk | 26 April 2021 8:30 AM GMTమెగాస్టార్ చిరంజీవి మలయాళ సూపర్ హిట్ 'లూసిఫర్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. రీమేక్ ల స్పెషలిస్ట్ మోహన్ రాజా ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. చిరు ఇమేజ్ ని మరియు మెగా అభిమానులను దృష్టిలో పెట్టుకొని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకొని సెట్స్ పైకి వెళ్లాలని అనుకుంటున్న సమయంలో కరోనా సెకండ్ వేవ్ బ్రేక్స్ వేసింది. అయితే కోవిడ్ కారణంగా మరికొంత టైం దొరికిందని భావించిన దర్శకుడు మోహన్ రాజా 'లూసిఫర్' స్క్రిప్ట్ కి మరిన్ని మెరుగులు దిద్దుతున్నాడట.
మలయాళ వర్షన్ లో లేని హీరోయిన్ పాత్రను తెలుగు 'లూసిఫర్' లో క్రియేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రని ఏ విధంగా జత చేయబోతున్నారనేది అందరిలో ఆసక్తికరంగా మారింది. అలానే హీరోయిన్ పాత్రకు సంబంధించిన సీన్స్ అన్నీ ఓ సాంగ్ లో చూపిస్తారా లేదా ఫుల్ లెన్త్ పాత్ర ఉంటుందా?, అందులో ఎవరు నటిస్తారు? అనే డిస్కషన్ మొదలైంది. ఇక ఇందులో హీరోతో పాటుగా మరో రెండు శక్తివంతమైన క్యారక్టర్స్ ఉంటాయి. అందులో హీరోకి నమ్మకంగా ఉండే అనుచరుడి పాత్రలో టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ నటిస్తారని సమాచారం. మలయాళంలో మంజు వారియర్ పోషించిన రోల్ లో ఎవరు నటిస్తారో చూడాలి.
కాగా, 'లూసిఫర్' రీమేక్ చిరంజీవి కెరీర్ లో రాబోతున్న 153వ సినిమా. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ - సూపర్ గుడ్ ఫిలిమ్స్ - ఎన్వీఆర్ సినిమా బ్యానర్స్ పై ఈ చిత్రం రూపొందుతోంది. ఆర్.బి చౌదరి - ఎన్.వి.ప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. లక్ష్మీ భూపాల్ ఈ మూవీకి సంభాషణలు రాస్తున్నారు. పరిస్థితులు అనుకూలిస్తే జూన్ లేదా జులై లలో ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించాలని చిత్ర బృందం ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం.