Begin typing your search above and press return to search.

కొంతమంది ఆఫీసర్లు గవర్నమెంట్ తొత్తులుగా పనిచేస్తున్నారు : మోహన్ బాబు

By:  Tupaki Desk   |   20 Dec 2022 5:16 AM GMT
కొంతమంది ఆఫీసర్లు గవర్నమెంట్ తొత్తులుగా పనిచేస్తున్నారు : మోహన్ బాబు
X
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మైక్ అందుకున్నారు అంటే ఏదో ఒక విషయం మీద ఒక సీరియస్ కామెంట్ వదులుతుంటారు. తన మార్క్ స్పీచ్ తో అలరించే మోహన్ బాబు లేటెస్ట్ గా విశాల్ నటించిన లాఠీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా తన స్పీచ్ తో ఆకట్టుకున్నారు. పోలీస్ నేపథ్య కథతో వస్తున్న ఈ లాఠీ సినిమా ఈవెంట్ లో భాగంగా పోలీసుల మీద తనకు అపారమైన గౌరవం ఉందని అన్నారు మోహన్ బాబు.

పోలీస్ అనే పదాన్ని తాను గౌరవిస్తానని.. మనలోనుంచే వెళ్లిన వాళ్లే పోలీసులు. మనం తప్పకుండా పోలీస్ ఆఫీసర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి.. పోలీసులు కూడా ఆఫీసర్స్.. అతను కూడా ఒక ఉద్యోగి అని అన్నారు. మనం ఎలాగైతే ఉద్యోగం చేస్తామో అతను కూడా తన డ్యూటీ చేస్తారని అన్నారు మోహన్ బాబు.

ఎక్కడ ఏ గొడవ జరిగినా సరే ఫస్ట్ నిజాలు తెలిసేది పోలీస్ అధికారులకే.. కానీ తన బాధ ఏంటంటే.. ఎక్కువ శాతం ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ కే కొంతమంది ఐ.ఏ.ఎస్ లు, ఐ.పి.ఎస్ లు పని చేస్తున్నారని అన్నారు.

పోలీస్ తన పై అధికారి దగ్గర నిజం చూశాను.. మీరు తప్పు చెప్పమంటున్నారని అడిగితే అతని ఉద్యోగం ఊడుతుంది.. కొంతమంది పై అధికారులు ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ కి తొత్తులుగా ఉంటారని అన్నారు. ఇది తాను ఓపెన్ గా చెబుతానని అన్నారు. అయినా సరే తనకు పోలీసులు అంటే చాలా గౌరవమని అందులో కానిస్టేబుల్స్ అంటే ఎక్కువ రెస్పెక్ట్ అని అన్నారు మోహన్ బాబు.

ప్రభుత్వాలకు పోలీసు అధికారులు తొత్తులుగా పనిచేస్తున్నాయి అన్న మోహన్ బాబు కామెంట్ రాజకీయ పరమైన వివాదాలకు దారి తీస్తుంది. ఏపీలో వైఎస్ జగన్ కుటుంబంతో సాన్నిహిత్యంగా ఉండే మోహన్ బాబు ఇలాంటి కామెంట్స్ చేయడం అందరిని షాక్ అయ్యేలా చేస్తుంది.

మోహన్ బాబు ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశాడు. సినిమా పోలీస్ బ్యాక్ డ్రాప్ కథ అని అలా క్యాజువల్ గా తన మార్క్ కామెంట్ చేశారా లేక నిజంగానే ఏదైనా ప్రభుత్వానికి చురక అంటించారా అన్నది చూడాలి. ఏది ఏమైనా విశాల్ లాఠీ ఈవెంట్ లో మోహన్ బాబు స్పీచ్ మరోసారి చర్చల్లో ఉండేలా చేసింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.