Begin typing your search above and press return to search.
మహేశ్ మూవీలో ముఖ్యమంత్రిగా మలయాళ స్టార్!
By: Tupaki Desk | 16 Feb 2022 2:30 AM GMTమహేశ్ బాబు ప్రస్తుతం 'సర్కారువారి పాట' సినిమా చేస్తున్నాడు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను మే 12వ తేదీన విడుదల చేయనున్నారు.
ఆ తరువాత సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ బాబు చేయనున్నాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. వచ్చేనెల నుంచి రెగ్యులర్ షూటింగుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
మహేశ్ బాబుతో త్రివిక్రమ్ సినిమా భారీస్థాయిలో ఉండనుందని అంటున్నారు. ఈ సినిమా కోసం పెద్ద పెద్ద స్టార్లను రంగంలోకి దింపుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో కీలకంగా కనిపించే పవర్ఫుల్ పాత్రగా ముఖ్యమంత్రి పాత్ర ఉంటుందట.
ఈ పాత్రను మోహన్ లాల్ చేస్తే బాగుంటుందని త్రివిక్రమ్ అభిప్రాయపడినట్టుగా చెబుతున్నారు. ఆయనైతే నిండుగా .. గంభీరంగా ఉంటాడు గనుక, ఆ పాత్ర నెక్స్ట్ లెవెల్ కి వెళుతుందని భావించాడని అంటున్నారు. మోహన్ లాల్ ను సంప్రదించడం .. ఆయన అంగీకరించడం జరిగిపోయిందని చెబుతున్నారు.
విభిన్నమైన పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ గా మోహన్ లాల్ కనిపిస్తారు. ఒక వైపున మలయాళ ఇండస్ట్రీలో చక్రం తిప్పుతూనే, మరో వైపున ఆయన ఇతర భాషా చిత్రాల్లో చేయడానికి కూడా ఉత్సాహాన్ని చూపుతుంటారు.
ఆ మధ్య 'జనతా గ్యారేజ్' లో ఆయన చేసిన పవర్ఫుల్ రోల్ ఇక్కడి ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అయింది. మళ్లీ ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో ఆయన కనిపించనున్నారు. ఈ ఏడాది చివరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ దిశగానే పనులు జరుగుతున్నాయి.
ఈ సినిమాలో మహేశ్ కథానాయికగా పూజ హెగ్డేను తీసుకున్నారు. ఆమె చెల్లెలి పాత్ర కోసం శ్రీలీలను అనుకున్నారు. అయితే తన పాత్ర నిడివి తక్కువగా ఉందనే అసంతృప్తిని శ్రీలీల వ్యక్తం చేసిందట. దాంతో ఆమెకి గల గ్లామర్ ను .. క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని, ఆమె పాత్ర నిడివిని త్రివిక్రమ్ పెంచాడని అంటున్నారు.
అంతేకాదు మహేశ్ బాబుతో ఆమెకి ఒక పాట ఉండేలా త్రివిక్రమ్ సెట్ చేశాడని చెబుతున్నారు. ఈ సినిమాతో శ్రీలీల దశ తిరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మొత్తానికి కృతి శెట్టి కంటే ముందుగానే శ్రీలీల పెద్ద హీరోల పక్కన ఛాన్సులు కొట్టేస్తోంది.