Begin typing your search above and press return to search.
బ్యాక్ టు బ్యాక్ ప్లాప్ పడ్డా వంద కోట్లకు తగ్గని సూపర్ స్టార్
By: Tupaki Desk | 27 Dec 2021 9:10 AM GMTఒకప్పుడు బాలీవుడ్ సినిమాల బడ్జెట్ లు భారీగా ఉండేవి. ఆ సినిమాల బడ్జెట్ లో కనీసం సగం కూడా సౌత్ సినిమాల బడ్జెట్ లు ఉండేవి. ఒక వేళ వచ్చినా ఏడాదికి ఒకటి అర మాత్రమే వచ్చేవి. కాని ఇప్పుడు సౌత్ లో ముఖ్యంగా తెలుగు మరియు తమిళంలో వస్తున్న సినిమాల బడ్జెట్ లు బాలీవుడ్ సినిమాల బడ్జెట్ లను దాటేస్తున్నాయి. మరీ భారీ బడ్జెట్ సినిమాలు కూడా సౌత్ లోనే వస్తున్నాయి. వందల కోట్ల బడ్జెట్ చిత్రాల జాబితాలో మలయాళ సినిమాలు కూడా చేరుతున్నాయి.
సౌత్ లో మలయాళ మరియు కన్నడ సినీ పరిశ్రమల పరిధి కాస్త తక్కువ అంటూ ఉంటారు. అందుకే మొన్న మొన్నటి వరకు కూడా అక్కడ పెద్ద హీరోల సినిమాల బడ్జెట్ లు పాతిక కోట్ల వరకే ఉండేది. కాని ఇప్పుడు పద్దతి మారుతుంది. కన్నడం మరియు మలయాళంలో కూడా వందల కోట్ల బడ్జెట్ తో సినిమా లు వస్తున్నాయి. కన్నడంలో కేజీఎఫ్ తో అది ప్రారంభం కాగా మలయాళంలో అంతకు ముందు నుండే ప్రారంభం అయ్యాయి.
మలయాళ స్టార్ హీరోలు కొందరు భారీ బడ్జెట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.. మరింత మంది వచ్చేందుకు సిద్దం అవుతున్నారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తన సినిమాల్లో ఎక్కువ శాతం భారీ బడ్జెట్ సినిమాలను చేస్తున్నాడు.
కొన్ని మాత్రం దృశ్యం మాదిరిగా తక్కువ బడ్జెట్ తో చేస్తున్నాడు. ఇక్కడ విచిత్రం ఏంటీ అంటే మోహన్ లాల్ తక్కువ బడ్జెట్ తో చేసిన సినిమాలు ఎక్కువ వసూళ్లను దక్కించుకుంటూ ఉంటే.. భారీ బడ్జెట్ తో చేసిన సినిమాలు మాత్రం నిరాశ పర్చుతూ తక్కువ వసూళ్లు నమోదు చేస్తున్నాయి.
మోహన్ లాల్ నుండి భారీ బడ్జెట్ చిత్రాలు చాలానే వచ్చాయి. అందులో మంచి కమర్షియల్ సక్సెస్.. సూపర్ హిట్ అయిన సినిమా లే లేవు అనడంలో సందేహం లేదు అంటూ స్వయంగా మలయాళ మీడియా వర్గాల వారు అంటున్నారు. ఆయన వంద కోట్ల బడ్జెట్ తో చేసిన సినిమాలు.. అంతకు మించి ఖర్చు చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.
అందుకు ప్రత్యక్ష సాక్ష్యం మొన్నటికి మొన్న వచ్చిన మరక్కార్. ఆ సినిమా ఆహా ఓహో అన్నట్లుగా తెరకెక్కించారు.. విడుదల చేశారు. కాని ఫలితం మాత్రం ఆ స్థాయిలో లేదనే చెప్పాలి.
మరక్కార్ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించలేదు అనేది అక్కడి బాక్సాఫీస్ వర్గాల వారి టాక్. నిర్మాతలకు వచ్చిన నష్టం.. లాభాల గురించి క్లారిటీ లేదు.. కాని ఇప్పుడు మోహన్ లాల్ మరో వంద కోట్ల బడ్జెట్ సినిమాను చేసేందుకు సిద్దం అయ్యాడు. గత రెండేళ్లుగా ప్రచారం జరుగుతున్న మోహన్ లాల్ బారోజ్ మూవీ ప్రారంభం అయ్యింది.
షూటింగ్ ప్రారంభం అయిన బారోజ్ ను పూర్తి స్థాయి 3డి మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారట. ఈ సినిమా లో మోహన్ లాల్ ఒక నిధి సంరక్షకుడిగా కనిపించబోతున్నాడు.
మూడు వందల ఏళ్ల నాటి కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నారట. మోహన్ లాల్ ఈ సినిమాకు స్వయంగా దర్శకత్వంను వహిస్తున్నాడు అనేది టాక్. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఈ సినిమా వంద కోట్లకు పైగానే ఖర్చు చేస్తారట. ఇప్పటి వరకు మోహన్ లాల్ చేసిన భారీ బడ్జెట్ సినిమాలు నిరాశ పర్చినా కూడా మళ్లీ పట్టుదలతో ఈ ప్రయత్నం చేస్తున్నారు.
ఇన్ని ప్లాప్ లు వచ్చినా కూడా పట్టువదలకుండా తగ్గేదే లే అన్నట్లుగా మోహన్ లాల్ వంద కోట్ల ను పెట్టేందుకు ముందుకు రావడం గ్రేట్ అంటూ ఆయన అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే మరి కొందరు మాత్రం ఈ సినిమా ఫలితం కూడా మళ్లీ అంతేనా అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.