Begin typing your search above and press return to search.

కంప్లీట్ యాక్టర్.. కంప్లీటవ్వని పంచ్ నానా!!

By:  Tupaki Desk   |   22 Nov 2016 10:22 AM GMT
కంప్లీట్ యాక్టర్.. కంప్లీటవ్వని పంచ్ నానా!!
X
'ఎ బిగ్ సెల్యూట్ టు వర్చువస్ ఇండియా' అంటూ ఒక బ్లాగ్ రాశాడు కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్. సినిమాల్లో నటించడం.. తన క్యారక్టర్ తో వేల మందిని మెప్పించడం.. ఇదంతా ఒక ఆర్ట్. కాని అలాగంటూ ఏదో దేశాన్ని ఉద్దరిస్తూ కామెంట్లు చేస్తే మాత్రం.. ఒక్కసారి గతం తవ్వుకోవాల్సి వస్తుంది. సరిగ్గా ఇప్పుడు ఈ కంప్లీట్ యాక్టర్ వేస్తున్న పంచ్.. కంప్లీటవ్వకుండా తనకే వచ్చి తిరిగి తగులుతోంది.

ఎంతో గొప్ప హై మోరల్ స్టాండర్డ్స్ చూపించినందుకు ఇండియాను .. దేశ ప్రజలను.. తెగ పొగిడేశాడు మోహన్ లాల్. కాని అసలు భారత దేశ ప్రధాని ఇలాంటి పని చేసింది మోహన్ లాల్ వంటి దిగ్గజాలను కంట్రోల్ చేయడానికి తెలుసా? ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్. విషయం ఏంటంటే.. ఓ ఐదేళ్ల క్రితం.. మోహన్ లాల్ పై త్రివేండ్రమ్ లో ఐటి రెయిడ్స్ జరిగాయి. బాబు గారు అప్పట్లో అసలు ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఏకంగా తన ఇంట్లోని కొన్ని గదుల్లోకి వెళ్ళకుండా.. ఐరిస్ రికగ్నిషన్ లాక్స్ పెట్టాడట. అంతేకాదు.. చాలా ఏళ్ళు ఎన్నో ఫైన్లు కట్టి.. అప్పుడు తన ఆస్తులను క్రమబద్దీకరణ చేసుకున్నాడు. ఇప్పుడేమో వర్చువస్ ఇండియా అంటున్నాడు.

అందుకే మోహన్ లాల్ బ్లాగ్ ఎంతోమందికి రుచించలేదు. ఎందుకంటే ఆయన ఆస్తుల్లో బ్లాక్ అండ్ వైట్ లొసుగులు చాలా ఉన్నప్పుడు.. ఈయన చాలా గొప్పగా మోడీ చేసిన పనిని పొగుడుతుంటే.. అది కామెడీగా ఉంది. కంప్లీటవ్వని పంచ్ లా ఉంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/