Begin typing your search above and press return to search.

సూపర్‌ స్టార్ ఇలా చేస్తే వారి పరిస్థితి ఏంటీ?

By:  Tupaki Desk   |   2 Jan 2021 5:00 AM GMT
సూపర్‌ స్టార్ ఇలా చేస్తే వారి పరిస్థితి ఏంటీ?
X
సినిమా పరిశ్రమ థియేటర్ల మీద.. థియేటర్లు సినిమా పరిశ్రమ మీద ఆధారపడి ఉన్నాయి. ఈ రెండు కూడా ఇండస్ట్రీలో భాగమే. ఎప్పుడైతే ఓటీటీలు ఎంట్రీ ఇచ్చాయో అప్పటి నుండి థియేటర్ల పై జనాల్లో చిన్న చూపు మొదలు అవుతుంది అనే టాక్‌ మొదలైంది. కరోనా కారణంగా దాదాపు 10 నెలలుగా థియేటర్ల ముఖం కూడా చూడని వారు చాలా మంది ఉన్నారు. వారు మళ్లీ థియేటర్లకు వచ్చేలా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క సినీ ప్రముఖుడికి ఉంది. తమ సినిమాలను ఓటీటీ ద్వారా థియేటర్ల ద్వారా విడుదల చేసినప్పుడు మాత్రమే ఆ పని జరుగుతుంది. చిన్న చితకా సినిమాలు ఓటీటీలో విడుదల అయినా పర్వాలేదు కాని పెద్ద సినిమాలు ఓటీటీలో విడుదల అయితే థియేటర్ల పరిస్థితి దారుణంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌ తన దృశ్యం2 సినిమాను ఇన్నాళ్లు వెయిట్ చేసి ఇప్పుడు ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడట. నాలుగు నెలలుగా సినిమా విడుదల విషయమై చర్చలు జరుగుతున్నాయి. పలు ఓటీటీలు భారీ మొత్తంను ఆఫర్‌ చేశాయని ప్రచారం జరిగింది. తాజాగా ఈయన అమెజాన్‌ ద్వారా విడుదల చేసేందుకు ఓకే చెప్పారు. అమెజాన్‌ ప్రైమ్‌ లో ఈ సినిమాను స్ట్రీమింగ్‌ చేసేందుకు ఒప్పందం జరిగిందని మలయాళ మీడియా కథనాలు వస్తున్నాయి. థియేటర్లు ఓపెన్‌ అయ్యి సినిమాలు మెల్ల మెల్లగా విడుదల అవుతున్న సమయంలో మోహన్ లాల్‌ ఇలా ఓటీటీకి వెళ్తే చిన్న హీరోలు నిర్మాతలు ఏం ఆలోచించాలి. వారు కూడా ఓటీటీ వైపు వెళ్తే థియేటర్ల పరిస్థితి ఏంటీ అంటూ థియేటర్ల యాజమాన్యాలు మోహన్‌ లాల్‌ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. ఇప్పటికైనా ఆయన నిర్ణయం మార్చుకోవాలని ప్రేక్షకులు సైతం విజ్ఞప్తి చేస్తున్నారు.