Begin typing your search above and press return to search.

ఇంతకీ లూసిఫర్ ఎలా ఉన్నాడు ?

By:  Tupaki Desk   |   13 April 2019 7:56 AM GMT
ఇంతకీ లూసిఫర్ ఎలా ఉన్నాడు ?
X
నిన్న సాయి తేజ్ చిత్రలహరి హడావిడిలో మనవాళ్ళు పట్టించుకోలేదు కాని మోహన్ లాల్ లూసిఫర్ కూడా ప్రేక్షకుల తీర్పు కోసం థియేటర్లలో అడుగు పెట్టింది. ప్రమోషన్ విషయంలో నిర్మాతలు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఓపెనింగ్స్ కూడా దానికి తగ్గట్టే డల్ గా ఉన్నాయి.మలయాళంలో వంద కోట్లు రాబట్టిన సినిమాగా రికార్డులు సృష్టిస్తున్న ఈ మూవీ ఇక్కడ ఇంత లో బజ్ తో రావడం వింతే.

పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో మాస్ హీరోయిజం ని ఓ రేంజ్ లో ఎలివేట్ చేస్తూ నటుడిగా హీరోగా చాలా పేరున్న పృద్విరాజ్ సుకుమారన్ దర్సకత్వం వహించిన మొదటి మూవీ ఇది. ఓ రాష్ట్ర ముఖ్య మంత్రి చనిపోతే ఆ పీఠం కోసం కుటుంబంలో కలకలం మొదలవుతుంది. స్వయానా అల్లుడే కుట్రలకు తెరతీస్తాడు. సిఎం రహస్యంగా పెళ్లి చేసుకున్న మొదటి భార్య కొడుకైన మోహన్ లాల్ రక్షణగా వచ్చి బయటికి కనిపించని పలుకుబడిని ఉపయోగించి తన లక్ష్యాన్ని పూర్తి చేస్తాడు. అదే లూసిఫర్

కథ పరంగా చూస్తే తెలుగులో వచ్చిన భరత్ అనే నేను-లీడర్-అజ్ఞాతవాసి ఛాయలలో మొదలైనా కాసేపటికే తనదైన ట్రీట్మెంట్ తో పృద్విరాజ్ అలరిస్తాడు. కాకపోతే లెంత్ ఎక్కువైపోయి ఏకంగా 3 గంటల నిడివి ఉండటం ఇబ్బంది కలిగిస్తుంది. ఇంత చేసినా ఫ్లాష్ బ్యాక్ లో చిన్న బిట్ ప్రీ క్లైమాక్స్ లో మొదలయ్యే ఐటెం సాంగ్ తప్ప ఇందులో పాటలే లేవు.

మోహన్ లాల్ ను మాస్ సినిమాలను విపరీతంగా ఇష్టపడే ప్రేక్షకులను లూసిఫర్ నిరాశపరచడు. అయితే మోహన్ లాల్ విలన్ వివేక్ ఒబెరాయ్ ని మినహాయించి నటీనటులంతా కేరళ మొహాలే కావడంతో మనకు కనెక్ట్ అయ్యే అవకాశం తగ్గింది. అక్కడక్కడా సాగతీతగా అనిపించినా మొత్తానికి లూసిఫర్ మాస్ ఆడియన్స్ కి ఓకే ఆప్షన్ గా నిలుస్తున్నాడు. దీన్ని పబ్లిక్ లోకి తీసుకెళ్ళేలా నిర్మాతలు ఏమైనా ప్రమోషన్ చేస్తే నయం. లేకపోతే లూసిఫర్ ఈ వారం దాటడం కూడా భారంగానే ఉంటుంది