Begin typing your search above and press return to search.
పోస్టర్ ని బ్యాన్ చేయమంటున్న పోలీసులు
By: Tupaki Desk | 3 April 2019 10:20 AM GMTఅవును మీరు చదివింది నిజమే. సినిమాను కాదు కేవలం ఓ పోస్టర్ ని బ్యాన్ చేయమంటున్నారు కేరళ పోలీసులు. ఇటీవలే మలయాళంలో విడుదలై ఘన విజయం సొంతం చేసుకున్న మోహన్ లాల్ లూసిఫర్ వసూళ్ళ వర్షంతో తడిసి ముద్దవుతోంది. వారం తిరక్కుండానే అరవై కోట్లు రాబట్టి లాల్ గత బ్లాక్ బస్టర్ పులి మురుగన్ ని క్రాస్ చేసే పనిలో ఉంది. అఫ్ కోర్స్ రికార్డులకు సంబంధించి అబద్దాలు చెబుతున్నారంటూ కొన్ని వివాదాలు కూడా మొదలైపోయాయి.
ఇదిలా ఉండగా పోస్ట్ ప్రమోషన్ లో భాగంగా యూనిట్ ఇటీవలే కొత్త పోస్టర్ ఒకటి విడుదల చేసింది. అందులో ఇన్స్ పెక్టర్ వేషం వేసిన జాన్ విజయ్ ను గోడకు కుదేసి మోహన్ లాల్ అతని ఛాతి మీద చెప్పులు వేసుకుని కాళ్ళు ఉంచిన స్టిల్ ఉంది. దీన్ని బాగా హై లైట్ చేస్తూ విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న చిత్రం అంటూ ప్రచారం మొదలుపెట్టారు
ఇది పోలీస్ వ్యవస్థను అవమానపరిచేలా ఉందంటూ కేరళ పోలీస్ అధికారుల సంఘం ఏకంగా ముఖ్యమంత్రి పినరాయ్ విజయన్ కు లేఖను అందించాయి. ఈ పోస్టర్ ను తక్షణం ఉపసంహరించేలా చర్యలు తీసుకోవాలని ఇది పబ్లిక్ లో తప్పుడు సంకేతాలు ఇస్తుందని అందులో పేర్కొన్నారు. సిఎం నుంచి సానుకూల స్పందన వచ్చింది.
ఇలాంటి వాటి వల్ల జనంలో పోలీసులంటే భయం తగ్గి జోకర్లు అనుకునే ప్రమాదం ఉందని మోహన్ లాల్ ఇలాంటివి ప్రోత్సహించకూడంటూ ప్రకటన కూడా చేశారు. లాల్ నుంచి ఇంకా స్పందన రాలేదు కాని ఓ పోస్టర్ ను బ్యాన్ చేయాలి అనే రేంజ్ లో మనోభావాలు దెబ్బ తింటున్నాయన్న మాట. అయితే ఎంత రక్షణ చేస్తున్నా పోలీసులు చేసే దురాగతాల గురించి కూడా ఆ సభ్యులు ఏదైనా చెప్పాలని లాల్ ఫ్యాన్స్ కోరుతున్నారు.