Begin typing your search above and press return to search.
మన్యం పులి.. ట్రైలర్ చూశారా?
By: Tupaki Desk | 30 Nov 2016 3:52 PM GMTవేరే భాష నుంచి తెలుగులోకి ఓ సినిమాను అనువాదం చేశారంటే ముందు ట్రైలర్ రుచి చూపిస్తారు. ఐతే మోహన్ లాల్ మూవీ ‘మన్యం పులి టీం మాత్రం ట్రైలర్ విషయంలో బాగా లేట్ చేసింది. ఈ చిత్రాన్ని రెండు వారాల ముందే రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ.. పెద్ద నోట్ల రద్దుతో సినిమా వాయిదా పడింది. దీంతో ట్రైలర్ని కూడా వాయిదా వేశారు. ఈ శుక్రవారం ‘మన్యం పులి’ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో రిలీజ్ ముంగిట ట్రైలర్ లాంచ్ చేశారు. ఒకటిన్నర నిమిషం నిడివి ఉన్న ‘మన్యం పులి’ ట్రైలర్ చాలా ఆసక్తికరంగానే ఉంది. విజువల్సే ఈ ట్రైలర్ కు ప్రధాన ఆకర్షణగా చెప్పాలి.
మొత్తం సినిమా అంతా దట్టమైన కేరళ అడవుల్లోనే తీసినట్లున్నారు. కథ మొత్తం కూడా అటవీ నేపథ్యంలోనే సాగేలా ఉంది. రక్తం రుచి మరిగిన క్రూరమైన పులులు.. సింహాల్ని వేటాడే వీరుడిగా కనిపిస్తాడు మోహన్ లాల్ ఇందులో. అతడి పాత్ర పేరు కుమార్. అతడు వన్య మృగాలతో పాటు కొందరు క్రూరమైన మనుషులకూ కంటగింపుగా మారతాడు. దీంతో శత్రువులు అతడికి ఉచ్చు బిగిస్తారు. ఆ ఉచ్చును అతనెలా ఛేదించాడన్నది ఈ చిత్ర కథ. జగపతి బాబు ఇందులో విలన్ పాత్ర పోషించడం విశేషం. జగపతి స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాగుంది. తనే సొంతంగా ఈ పాత్రకు డబ్బింగ్ చెప్పడం విశేషం. ట్రైలర్ అంతటా విజువల్స్ అదిరిపోయాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా సూపర్బ్. వైశాఖ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సింధూరపువ్వు కృష్ణారెడ్డి తెలుగులో అందిస్తున్నాడు
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/