Begin typing your search above and press return to search.
బాహుబలి అనుకుంటే బొక్క బోర్లా పడింది
By: Tupaki Desk | 14 Dec 2018 5:17 PM GMTమలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ‘ఓడియన్’ మూవీపై మలయాళ సినీ పరిశ్రమలో మాత్రమే కాకుండా తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో కూడా భారీ ఆసక్తి వ్యక్తం అయ్యింది. ఈ చిత్రంను మలయాళంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కించడంతో పాటు భారీ ఎత్తున ప్రమోషన్స్ చేయడంతో సినిమాకు విపరీతంగా హైప్ పెరిగింది. తెలుగు ‘బాహుబలి’ స్థాయిలో మలయాళ ‘ఓడియన్’ ఉంటుందని కొందరు అంచనాలు వేశారు. ఆ స్థాయిలో పబ్లిసిటీని దక్కించుకున్న ఓడియన్ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సౌత్ లో మొత్తం నేడు విడుదలైన ఓడియన్ తీవ్రంగా నిరాశ పర్చింది. బాహుబలి స్థాయి అనడంతో మొదటి రోజు మొదటి ఆటకు భారీగా టికెట్లు తెగాయి. కాని రెండవ ఆటకు పరిస్థితి మారిపోయింది. మోహన్ లాల్ ఫ్యాన్స్ కూడా సినిమాను చూసి పెదవి విరుస్తున్నారు. ఓడియన్ చిత్రం మలయాళ సినీ పరిశ్రమ రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం అంటూ అక్కడ వారు అనుకున్నారు. రికార్డులు బద్దలు సంగతి పక్కన పెడితే పెట్టుబడి వచ్చే పరిస్థితి కూడా లేదు అంటూ అక్కడ ట్రోల్స్ వస్తున్నాయి.
సోషల్ మీడియాలో ఓడియన్ ను ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు. మోహన్ లాల్ యాంటీ ఫ్యాన్స్ తో పాటు, ఓడియన్ పై భారీ అంచనాలు పెట్టుకుని నిరాశ పడ్డ వారు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంతోటి సినిమాకు అంత సెటప్పు - ఇంత బడ్జెట్ అవసరమా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ సంవత్సరంలో బాలీవుడ్ థగ్స్ ఆఫ్ హిందూస్థాన్, మల్లూవుడ్ ‘ఓడియన్’ లు డిజాస్టర్స్ కా బాప్స్ అంటూ పేరు తెచ్చుకున్నాయంటూ ట్రోల్ అవుతున్నాయి.