Begin typing your search above and press return to search.
సూపర్ స్టార్ నీతులు బాగా చెబ్తున్నాడు
By: Tupaki Desk | 25 Feb 2016 7:28 AM GMTమలయాళ సూపర్ స్టార్ ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిస్థితులపై తెగ బాధపడిపోతున్నాడు. పార్లమెంట్ ను కూడా కుదిపేస్తున్న యూనివర్సిటీల అంశంపై నోరు విప్పిన మోహన్ లాల్.. విద్యాలయాలు ఇలా అయిపోవడాన్ని జీర్ణించుకోలేక పోతున్నానని చెప్పాడు. అంతే కాదు.. 'ఇప్పుడు భారత దేశం చనిపోతోంది. ఇండియా చచ్చిపోతున్నపుడు... మనం బతికుండి అర్ధమేముంది' ఇదీ మోహన్ లాల్ ప్రశ్న
అంతే కాకుండా దేశం కోసం సైనికులు ప్రాణత్యాగం చేస్తుంటే.. దేశం నడిబొడ్డున కూర్చుని దేశ వ్యతిరేక విధానాలు అవలంబిచడాన్ని తప్పు పట్టారు మోహన్ లాల్. ఇందులో ఎలాంటి తప్పు లేదు కానీ.. ఈయనకు ఇలా మాట్లాడే అర్హత ఉందా అన్నది అసలు ప్రశ్న. ఎందుకంటే.. రీసెంట్ గా ఈయన ఇల్లు, ఆఫీసులపై ఐటీ రైడ్స్ జరిగినపుడు.. లెక్కకు మించిన పన్ను కట్టని ఆస్తులు బయటపడ్డాయి. అంటే కుప్పలు తెప్పలుగా బ్లాక్ మనీ పోగేసుకున్నారన్న మాట. ఇప్పుడు దేశం ఎదుర్కొంటున్న సమస్యల్లో బ్లాక్ మనీ కూడా ఒకటి.
కనీసం తాను లెక్క చూపని ఆస్తులపై మాట కూడా మాట్లాడని మోహన్ లాల్.. ఇప్పుడు దేశం గురించి నీతులు మాట్లాడ్డం హాస్యాస్పదం అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. నీతులు చెప్పేటపుడు బాగానే ఉంటాయి కానీ.. అవి చెప్పేందుకు మచ్చలేని వ్యక్తిత్వం అవసరం. లేకపోతే గురివింద గింజ సామెత మాదిరిగా ఉంటుంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.