Begin typing your search above and press return to search.

సూపర్‌ స్టార్‌.. ఈ విషయం మాత్రం జీరో స్టార్‌

By:  Tupaki Desk   |   20 Nov 2018 11:38 AM GMT
సూపర్‌ స్టార్‌.. ఈ విషయం మాత్రం జీరో స్టార్‌
X
మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌ మరోసారి వివాదాస్పదం అయ్యాడు. కొన్నాళ్ల క్రితం మలయాళ హీరోయిన్‌ భావనను లైంగిక వేదించాడు అంటూ దిలీప్‌ పై కేసు నమోదు అయిన తర్వాత కూడా ఆయన్ను వెనకేసుకుని వచ్చాడు. మలయాళ మూవీ ఆర్టిస్టు అసోషియేషన్‌ ను దిలీప్‌ ను తొలగించకుండా వివాదాస్పదంగా నిర్ణయం తీసుకున్నాడు. దిలీప్‌ కు అనుకూలంగా వ్యవహరించాడు. ఆ సమయంలోనే ఆయన సూపర్‌ స్టార్‌ ఇమేజ్‌ ను కోల్పోయాడు. ఆ విషయంలో మాత్రం కింది స్థాయి వారి నుండి పై స్థాయి వారి వరకు అంతా కూడా విమర్శలు చేశారు. ఆ సమయంలోనే సూపర్‌ స్టార్‌ ను కాస్త జీరో స్టార్‌ అంటూ ఎద్దేవ చేశారు.

మరోసారి మోహన్‌ లాల్‌ సంచలన వ్యాఖ్యలు చేసి వివాదాస్పదం అయ్యాడు. దేశ వ్యాప్తంగా మీటూ ఉద్యమం భారీ ఎత్తున జరుగుతున్న ఈ సమయంలో మోహన్‌ లాల్‌ అదొక ఉద్యమమే కాదని ఎద్దేవ చేశాడు. స్టార్స్‌ పై లైంగిక వేదింపు ఆరోపణలు చేయడం అనేది ఫ్యాషన్‌ అయ్యిందని, పబ్లిసిటీ కోసమే ఎక్కువ మంది లైంగిక వేదింపుల ఆరోపణలు చేస్తూ మీటూ అంటున్నారు అన్నాడు. మోహన్‌ లాల్‌ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి.

కేరళ వరద బాధితుల సహాయార్థం విరాళాలు సేకరించేందుకు ప్రభుత్వం దుబాయిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోహన్‌ లాల్‌ పాల్గొన్నాడు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ మీటూ గురించి పై విధంగా స్పందించాడు. మీటూ అనేదాన్ని నేను ఒక ఉద్యమంగానే పరిగణించను. అదొక వెర్రిగా మారింది. ఇలాంటి మీటూల వల్ల మలయాళ ఇండస్ట్రీకి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నాడు. లైంగిక వేదింపులు అనేవి జీవితంలో ఎకడైనా - ఎప్పుడైనా జరగొచ్చు. వాటిని ఇండస్ట్రీకి ఆపాదించడం ఏమాత్రం సరికాదన్నాడు.

మోహన్‌ లాల్‌ తాజా వ్యాఖ్యలతో మరోసారి ఆయన్ను జీరోస్టార్‌ అంటూ సోషల్‌ మీడియాలో కొందరు మహిళలు మరియు నెటిజన్స్‌ సంభోదిస్తున్నారు. మహిళల పట్ల కనీస గౌరవం లేని వ్యక్తి సూపర్‌ స్టార్‌ ఎలా అవుతాడని ప్రశ్నిస్తున్నారు.