Begin typing your search above and press return to search.

రెహమాన్ కి పోటీగా ఆయన స్టూడెంట్స్

By:  Tupaki Desk   |   21 Dec 2017 10:00 AM IST
రెహమాన్ కి పోటీగా ఆయన స్టూడెంట్స్
X
గురువును మించిన శిష్యులు అనే పదం చాలా అరుదుగా వినిపిస్తుంటుంది. టీచర్ దగ్గర పాటలు నేర్చుకొని మళ్లీ ఆ టీచర్ కు పోటీగా నిలవడం అనేది సామాన్యమైన విషయం కాదు. అయితే సినీ ఇండస్ట్రీలో మాత్రం తరచు గురువుని మించిన శిష్యులు వస్తుంటారు. ప్రస్తుతం గురువులు శిష్యులు చాలామందే టాలీవుడ్ లో పోటీ పడుతున్నారు. అయితే ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్ కి పోటీగా అయన స్టూడెంట్ కూడా ఇప్పుడు నిలబడ్డారు.

హాలీవుడ్ నుంచి ప్రతి ఏటా ఆస్కార్ కి మన ఇండియన్ సినీ కళాకారులు ఎవరో ఒకరు సెలెక్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. రెహమాన్ కూడా ఈసారి పోటీలో ఉన్నాడు. అయితే పోటీగా ఆయన స్టూడెంట్స్ గ్రూపు కుతుబ్-ఈ-కృపా ఆస్కార్ నామినేషన్ లో నిలిచింది. రెహమాన్ కేఎం మ్యూజిక్ అకాడమీ నుండి సంగీత పాటలను నేర్చుకున్న ఈ నలుగురి టీమ్ హాలీవుడ్ లో లేక్ ఆఫ్ ఫైర్ అనే హాలీవుడ్ సినిమాకు నేపథ్య సంగీతం అందించారు. ఆ మ్యూజిక్ అందరికి నచ్చేసింది. మ్యూజిక్ విభాగంలో వారి పేరుతో పాటు రెహమాన్ నేమ్ కూడా ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అవార్డును ఎవరు దక్కించుకుంటారు అనే విషయం దేశమంతటా చర్చనీయాంశంగా మారింది.

అయితే అవార్డు దక్కాలంటే.. ముందు ఈ సినిమాకు ఆస్కార్ నామినేషన్ దక్కాలి. ఇంకా నామినేషన్లు ప్రకటించలేదు కాబట్టి.. అసలు రెహ్మాన్ అండ్ గ్యాంగ్ ఆస్కార్ రేసులో ఉంటారా లేదా అనే విషయంపై ఇప్పుడు కామెంట్ చేయడం కాస్త ఓవరే. వెయిట్ అండ్ సి.