Begin typing your search above and press return to search.
ఇండియాస్ హైయెస్ట్ బడ్జెట్ మూవీ క్యాన్సిల్
By: Tupaki Desk | 4 April 2019 12:19 PM GMTమలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో ఇండియాలోనే ఇప్పటి వరకు ఏ సినిమాకు చేయని విధంగా ఖర్చు చేసి వెయ్యి కోట్లతో ఒక సినిమాను నిర్మించబోతున్నట్లుగా చాలా కాలం క్రితం అధికారిక ప్రకటన వచ్చింది. శ్రీ కుమార్ దర్శకత్వంలో యూఏఈకి చెందిన వ్యాపారవేత్త బీఆర్ శెట్టి ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సిద్దం అయ్యాడు. మహాభారత నేపథ్యంలో భీముడి పాత్ర సెంటర్ పాయింట్ గా సినిమా కథను మల్చి స్క్రిప్ట్ కూడా సిద్దం చేశారు. ప్రముఖ రచయి వాసుదేవ్ మీనన్ కథ మరియు స్క్రీన్ పే కూడా సిద్దం చేశాడు. త్వరలోనే సినిమా ప్రారంభం అవుతుందని, నటీ నటుల ఎంపిక జరుగుతుందని అంతా ఎదురు చూస్తున్న సమయంలో నిర్మాత శెట్టి సినిమా క్యాన్సిల్ అంటూ ప్రకటించాడు.
కొన్ని నెలల క్రితమే ఈ భారీ ప్రాజెక్ట్ అటకెక్కినట్లే అని, దర్శకుడు శ్రీకుమార్ మరియు రచయిత వాసుదేవ్ మీనన్ ల మద్య విభేదాల కారణంగా సినిమా క్యాన్సిల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ వార్తలు వచ్చాయి. తాజాగా ఆ వార్తలు నిజం చేసేలా నిర్మాత బీఆర్ శెట్టి కొన్ని కారణాల వల్ల సినిమా క్యాన్సిల్ అయ్యిందని ఒక ఇంగ్లీష్ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. సినిమా కోసం చాలా కష్టపడ్డా కూడా కొన్ని కారణాలతో ఆరంభం కాకుండానే క్యాన్సిల్ అయ్యిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ విషయమై రచయిత వాసుదేవ్ మీనన్ మాట్లాడుతూ.. తాను సినిమా కోసం స్క్రిప్ట్ ఇచ్చి నాలుగు సంవత్సరాలు అయ్యింది. స్క్రిప్ట్ ఇచ్చే సమయంలలోనే మూడు సంవత్సరాల్లో సినిమా తీయాలని లేదంటే తన స్క్రిప్ట్ ను వెనక్కు తీసుకుంటాను అంటూ చెప్పాడు. కాని మూడు సంవత్సరాల్లో సినిమా ప్రారంభం కాలేదు, ఆ తర్వాత మరో సంవత్సరం పాటు దర్శకుడు శ్రీ కుమార్ కు టైం ఇచ్చాడు. అయినా కూడా సినిమా ఆరంభం కాకపోవడంతో స్క్రిప్ట్ ను వెనక్కు తీసుకున్నట్లుగా చెప్పడంతో పాటు, అడ్వాన్స్ ను కూడా తిరిగి ఇచ్చేసినట్లుగా రచయిత ప్రకటించాడు. దాంతో సినిమా క్యాన్సిల్ అయ్యిందని మలయాళ సినీ వర్గాల వారు అన్నారు. ఇండియాస్ బిగ్గెస్ట్, హైయెస్ట్ బడ్జెట్ మూవీ అంటూ దీన్ని ఆకాశానికి ఎత్తిన మేకర్స్ ఇప్పుడు ప్రారంభంకు ముందే వదిలేయడం విడ్డూరంగా ఉంది.