Begin typing your search above and press return to search.
మోహన్ లాల్ ను తిట్టిపోస్తున్నారు
By: Tupaki Desk | 28 Jun 2018 12:35 PM GMTమలయాళం సినిమా ఇండస్ట్రీలో మోహన్ లాల్ పేరు మారుమ్రోగిపోతోంది. అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (AMMA) ప్రెసిడెంట్ గా ఎంపికైన మోహన్ లాల్ తీసుకున్న మొట్టమొదటి నిర్ణయమే అందరిని నిరుత్సాహపరిచింది. ఆ నిర్ణయం మలయాళం హీరో దిలీప్ ను AMMA లోకి తిరిగి తీసుకురావడం మహిళలతో పాటు చాలా మందిని బాధపెడుతోంది.
ఒక పాపులర్ హీరోయిన్ అపహరణ కేసులో దిలీప్ ను జైల్లో పెట్టారు. ఈ కేస్ వల్ల మమ్మూట్టి దిలీప్ ను AMMA నుండి తీసేశారు. 85 రోజులు జైలు జీవితం గడిపి బయటకివచ్చిన దిలీప్ ను తిరిగి AMMA లోకి తీసుకుకోవడం అందరిని ఆగ్రహానికి గురి చేస్తోంది. కిడ్నాప్ కు గురి అయిన హీరోయిన్ తో పాటు మరో నలుగురు కూడా స్వయంగా AMMA నుండి తప్పుకున్నారు. కమిటీ చైర్మన్ జోసెఫిన్ "ఈ నిర్ణయం తరువాత ఈ ఆర్గనైజేషన్ కు 'AMMA' (అమ్మ) అనే పేరు సూటవ్వదు. రూలింగ్ గవర్నమెంట్ మరియు సిపిఐ పార్టీ ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి." అని పేర్కొన్నారు.
PWD మినిస్టర్ జి.సుధాకరన్ కూడా దిలీప్ పైన తనకెప్పుడు ఒక మంచి అభిప్రాయం లేదని - ఆ నలుగురు హీరోయిన్లను తాను సపోర్ట్ చేస్తున్నానని తెలిపారు. కేరళ ఫిషరీస్ మినిస్టర్ జె.మెర్సీకుట్టి కూడా మోహన్ లాల్ పై నిప్పులు చెరిగారు. దిలీప్ ను AMMA నుండి తీసేసిన మమ్మూట్టి ఈ విషయంపై ఇంకా కామెంట్ చేయాల్సి ఉంది.