Begin typing your search above and press return to search.
మోహన్ లాల్ వ్యాఖ్యలపై దుమారం
By: Tupaki Desk | 23 Nov 2016 9:26 AM GMTసోషల్ మీడియా యాక్టివ్ అయ్యాక వచ్చిన సమస్య ఏంటంటే.. ప్రతి ఒక్కరూ ప్రతి విషయం మీదా స్పందించేయడం. సెలబ్రెటీలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. పర్యవసనాలు ఆలోచించకుండా.. వాస్తవ పరిస్థితిని గమనించకుండా.. సెలబ్రెటీలు చేసే కొన్ని కామెంట్లు జనాలకు చిర్రెత్తుకొచ్చేలా చేస్తుంటాయి. తాజాగా మోహన్ లాల్ చేసిన వ్యాఖ్యలు అలాంటివే.
పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థిస్తూ మోహన్ లాల్ తాజాగా ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ నిర్ణయాన్ని పొగిడేస్తూ తన బ్లాగ్ లో పెద్ద పోస్టు పెట్టాడు. వాట్సాపుల్లో.. మిగతా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో ఫార్వర్డ్ అవుతున్న మెసేజుల్నే కాస్త అటు ఇటు తిప్పి ఈ స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా ఉంది దాన్ని చదివితే. సినిమా థియేటర్ల దగ్గర.. వైన్ షాపుల దగ్గర.. గుళ్ల దగ్గర నిలబడితే రాని ఇబ్బంది.. ఏటీఎంల దగ్గర నిలబడితే ఎందుకొస్తుంది అంటూ ఆయన ప్రశ్నలు సంధించారు. ఐతే ఆయన ఈ స్టేట్మెంట్ ఇచ్చిన సమయంలోనే కేరళలో డబ్బుల కోసం ఏటీఎంల దగ్గర లాంగ్ క్యూల్లో నిలబడి ఇద్దరు ప్రాణాలు వదిలారు. దీంతో జనాలకు మోహన్ లాల్ వ్యాఖ్యలు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. వైన్ షాపుల దగ్గర నిలబడే వారితో ఏటీఎంల నిలబడే వారిని పోల్చడమూ వివాదానికి కారణమైంది.
మరోవైపు ఇప్పుడు నల్లధనం విషయమై సుద్దులు చెబుతున్న మోహన్ లాల్.. కొన్నేళ్ల కిందట ఐటీ అధికారుల దాడిలో దొరికిపోవడం.. నల్లధనం భారీగా దాచి పెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కోవడం జనాలకు గుర్తుకొచ్చి ఈ సూపర్ స్టార్ మీద మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మోడీకి మద్దతుగా స్టేట్మెంట్ ఇచ్చి మార్కులు కొట్టేద్దామనుకున్న లాల్ కు.. రివర్స్ పంచ్ పడేలా కనిపిస్తోంది పరిస్థితి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/