Begin typing your search above and press return to search.
కూతురు చేసిన పనికి గర్విస్తున్న సూపర్ స్టార్.. ఎందుకంటే?
By: Tupaki Desk | 24 Feb 2021 11:30 PM GMTప్రస్తుతం బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు అన్ని ఇండస్ట్రీలలో వారసుల కాలం నడుస్తుంది. అటు హీరోలుగా కొడుకులు ఎంట్రీ ఇస్తుంటే.. ఇటు హీరోయిన్లుగా కూతుళ్లు అరంగేట్రం చేస్తున్నారు. కానీ కొందరు సూపర్ స్టార్స్ వారసులు మాత్రమే డిఫరెంట్ ప్రొఫెషన్ ఎంచుకుని ఆశ్చర్యపరుస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూతురు విస్మయ. ఎందుకంటే మలయాళం ఇండస్ట్రీలో మోహన్ లాల్ సూపర్ స్టార్.. కానీ ఆయన కూతురు మాత్రం రైటింగ్ సైడ్ అడుగులేసి ఏకంగా ఇటీవల తను రాసిన పుస్తకం లాంచ్ చేసింది. ప్రస్తుతం మోహన్ లాల్ చాలా గర్వంగా పట్టలేని సంతోషంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే కూతురు రాసిన పుస్తకం గురించి ఓ లెజెండరి పర్సన్ మెచ్చుకోవడమే కారణం.
'గ్రెయిన్స్ ఆఫ్ స్టార్‌డస్ట్' పేరుతో విస్మయ రాసిన పుస్తకం ఇప్పుడు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మార్కెట్లలో అందుబాటులో ఉంది. ఈ సందర్బంగా మోహన్ లాల్ స్వయంగా తన కూతురు రాసిన పుస్తకాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం జరిగింది. అలాగే ఇటీవల విస్మయ రాసిన బుక్ ‘గ్రెయిన్స్ ఆఫ్ స్టార్‌డస్ట్’ బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు బహుమతిగా పంపించాడట మోహన్ లాల్. అయితే పుస్తకం చదివిన అమితాబ్.. 'నేను అభిమానించే వ్యక్తి మోహన్ లాల్. ఆయన కూతురు విస్మయ రాసిన 'గ్రెయిన్స్ ఆఫ్ స్టార్‌డస్ట్' బుక్ నాకు స్పెషల్ గా పంపించారు. ఆ బుక్ ఎంతో సృజనాత్మకంగా.. కవితలు, పెయింటింగ్‌లతో నిండి ఉంది. చక్కని కవిత్వంతో కూడిన ఆ పుస్తకం నాకు ఎంతో నచ్చింది. నాకు తెలిసి ఈ టాలెంట్ వారసత్వం నుండే వచ్చింది కాబోలు. విస్మయకు శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేసి సర్ప్రైజ్ ఇచ్చారు. ది గ్రేట్ అమితాబ్ నుండి ప్రశంసలు దక్కడంతో మోహన్ లాల్ పొంగిపోతున్నారు.