Begin typing your search above and press return to search.
సూపర్ స్టార్ కి ఇంత పట్టుదలా !!
By: Tupaki Desk | 17 March 2016 3:30 PM GMTమలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్.. ఇప్పుడు తెలుగులో రెండు సినిమాలు ఒప్పుకున్నాడు. ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ తో పాటు.. చంద్రశేఖర్ ఏలేటి డైరెక్షన్ లోనూ మూవీ చేస్తున్నాడు. వీటిలో నటించేందుకు తెలుగు కూడా నేర్చేసుకుంటున్నాడు. మొహంలో భావాలు పలికించాలంటే ప్రతీ పదానికి అర్ధం తెలియాలనే పట్టుదలతోనే ఇలా తెలుగు నేర్చుకుంటున్నాడు. ఇలా పట్టుబట్డడం ఇలాంటి విషయాల్లోనే కాదు.. కొన్ని వ్యక్తిగత విషయాల్లోనూ ఉంటుందని ఇప్పుడే జనానికి అర్ధమవుతోంది.
రీసెంట్ గా కేరక్టర్ నటుడు కళాభవన్ మణి మరణించిన విషయం తెలిసిందే. ఈయనకు స్మృతిగా ఓ సంస్మరణ సభ జరపాలని మలయాళ సినీ పరిశ్రమ నిర్ణయించింది. ఈ సభ నుంచి డైరెక్టర్ వినయన్ ను తప్పించాలని మోహన్ లాల్ డిమాండ్ చేయడం వివాదానికి దారి తీసింది. వినయన్ కు, కళా భవన్ మణికి మంచి సాన్నిహిత్యం ఉంది. ఇద్దరూ కలిసి అనేక సినిమాల్లో నటించారు కూడా. అయితే.. ఈ వినయన్ కు పదులు తనకు నచ్చిన దర్శకుడైన మేజర్ రవిని పిలవాలని ఓ సలహా కూడా పారేశాడు మోహన్ లాల్. కానీ మేజర్ రవితో కళాభవన్ మణి ఒక సినిమా కూడా చేయలేదు. దీంతో మల్లూవుడ్ జనాలకు ఏం చేయాలో అర్ధం కావడం లేదు.
మోహన్ లాల్ లాంటి నటుడు.. తన విబేధాలను ప్రదర్శించడానికి.. ఇలా ఓ సంస్మరణ సభను ఉపయోగించుకోవడం సరికాదనే సూచనలు వినిపిస్తున్నాయి. ఈ సంఘటనతో.. సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇలా ప్రవర్తించటం పద్దతిగా లేదని అనుకుంటున్నారు జనాలు