Begin typing your search above and press return to search.

ఆ హీరోయిన్ కెరీర్ నాశనమైపోయింది

By:  Tupaki Desk   |   25 Aug 2016 10:30 PM GMT
ఆ హీరోయిన్ కెరీర్ నాశనమైపోయింది
X
అటు బాలీవుడ్.. ఇటు టాలీవుడ్ జనాలందరూ పూజా హెగ్డేను చూసి తెగ ఫీలైపోతున్నారు. అనవసరంగా బ్రహ్మాండమైన కెరీర్‌ ను మిస్సయిపోయిందే అని జాలి పడుతున్నారు. ఒక లైలా కోసం.. ముకుంద లాంటి సినిమాలతో టాలీవుడ్లో మంచి పేరు సంపాదించి.. క్రేజీ హీరోయిన్ గా మారే సమయంలో ‘మొహెంజదారో’ కోసమని ఇక్కడి అవకాశాలన్నీ కాదనుకుని ముంబయికి వెళ్లిపోయిన పూజకు ఆ సినిమా ఎలాంటి ఫలితాన్నిచ్చిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. రెండేళ్ల పాటు ఈ సినిమాకు అంకితమైపోయిన పూజ.. తన కెరీర్లో విలువైన సమయాన్ని కోల్పోయింది. రెండేళ్ల కిందట ఉన్న క్రేజ్ ఆమెకిప్పుడు లేదు. ఆమెలో ఒకప్పటి గ్లామర్ కూడా దెబ్బ తింది.

పోనీ ‘మొహెంజదారో’ హిట్టయిన సంతోషమైనా ఉందా అంటే అదీ లేదు. ఆ సినిమా ఓ చేదు జ్నాపకంగా మిగిలిపోయింది. టాలీవుడ్లో బన్నీ సరసన ఓ ఛాన్స్ వచ్చిందంటున్నారు కానీ.. దానిపై స్పష్టత లేదు. ఒక హీరో ఎంత కాలం ఇలా ఒక సినిమాకే అంకితమైపోయినా పర్లేదు. కానీ హీరోయిన్ల పరిస్థితి అలా కాదు. వాళ్ల కెరీర్ స్పాన్ తక్కువ. కెరీర్లో విలువైన సంవత్సరాలు వృథా అయిపోతే ఎలా ఉంటుందో చెప్పడానికి పూజ కెరీరే నిదర్శనం. కాజల్.. సమంత.. తమన్నా లాంటి హీరోయిన్ల జోరు తగ్గుతున్న టైంలో మన దర్శక నిర్మాతలకు మంచి ఛాయిస్ లాగా కనిపించింది పూజా. ఓ స్టార్ హీరోయిన్ కు కావాల్సిన లక్షణాలన్నీ ఉన్నా.. ఇక్కడ మంచి ఛాన్సులొస్తున్నా వద్దనుకుని వెళ్లింది. ఇప్పుడు ఆమె తెలుగు సినిమాల్లో నటించడానికి రెడీగా ఉన్నా.. అవకాశాలు దక్కేట్లు లేవు. మొత్తానికి ‘మొహెంజదారో’ పుణ్యమా అని పూజ కెరీర్ నాశనమైనట్లే కనిపిస్తోంది.