Begin typing your search above and press return to search.
గ్లాడియేటర్ లాంటి మొహెంజొదారో..పెద్ద జీరో?
By: Tupaki Desk | 13 Aug 2016 4:56 AM GMTమొహెంజొదారో మూవీపై బాలీవుడ్ లోనే కాదు.. దేశవ్యాప్తంగా చాలానే అంచనాలు ఏర్పడ్డాయి. అశుతోష్ గోవార్కర్ తీసిన సినిమా కావండతో ఇండియా మొత్తం ఎదురుచూసింది. టాలీవుడ్ చిత్రరాజం బాహుబలిని మించిపోయే చిత్రం అని ప్రచారం జరగడంతో ఇక్కడ కూడా ఆసక్తి కనిపించింది. కానీ మొహెంజొదారో చిత్రం ఏ స్థాయిలోనూ అంచనాలను అందుకోవడం అసాధ్యం అని తేలిపోయింది.
అమ్రి అనే ఓ పల్లెటూళ్లో ఉండే హీరో.. మొహెంజొదారో గురించి విని అక్కడికెళ్లి బతికేద్దామని అనుకుంటాడు. అందరినీ ఒప్పించి వెళ్లాక.. ఆ ఊరిని చూసి మెస్మరైజ్ అయిపోతాడు. కానీ అక్కడి పరిస్థితులు చూసి వెళ్లిపోదామని అనుకుని.. పూజారి కూతురిని చూసి ఆగిపోతాడు. ఆమెతో ప్రేమలో పడతాడు. మొహెంజొదారోను ఓ క్రూరుడైన ప్రధాన్(రాజు అనుకోండి) పాలిస్తూ ఉంటాడు. రాజు కొడుకు కూడా దుర్మార్గుడే. ఆ తండ్రీ కొడుకుల నుంచి మొహెంజొదారో ప్రజలను హీరో ఎలా కాపాడేస్తాడు? హీరోయిన్ ను ఎలా దక్కించుకుంటాడు? ఇదే సినిమా.
సినిమా కోసం వేసిన సెట్స్.. హంగామా.. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ మాత్రమే మొహెంజొదారోకి ప్లస్ పాయింట్స్. మిగతావన్నీ నీరసంగానే నడుస్తాయి. ఏ రకంగాను బాహుబలి కాదు కదా.. సాధారణ చిత్రానికి కూడా పోటీ అనిపించదు. అసలు ఈ స్టోరీని మొహెంజొదారో అంటూ చారిత్రకంగానే ఎందుకు తీయాలో అర్ధం కాని విషయం. ఎందుకంటే అసలు చరిత్రకు.. ఈ చిత్రానికి పిసరంత కూడా సంబంధం ఉండదు. ఇంతకీ ఈ మూవీ స్టోరీ తెలిశాక.. ఆస్కార్ విన్నర్ అయిన హాలీవుడ్ మూవీ గ్లాడియేటర్ గుర్తొచ్చేస్తే అది చూసినోళ్ల తప్పు ఏ మాత్రం కాదు.