Begin typing your search above and press return to search.
ఇందుకే మన సినిమాలను బూతులు తిట్టేది
By: Tupaki Desk | 20 July 2016 12:58 PM GMTమామూలుగా భారతీయ సినిమాలు హాలీవుడ్ కాన్వస్ పై నడవవు అనే రిమార్కు ఒకటి ఉంది. అలా ఉండడంలో కూడా తప్పులేదు. ఎందుకంటే ఒక సినిమాను తీసుకున్నప్పుడు.. ఆ సినిమా కథ అండ్ కథనం ఎలా ఉన్నా కూడా.. కొన్ని మాత్రం చాలా రియలిస్టిక్ గా ఉండాలి. అవే.. లొకేషన్లు - బట్టలు - వస్తువులు వగైరా. ముఖ్యంగా చరిత్ర మీద సినిమాలు తీసినప్పుడు మాత్రం చాలా బాగుండాలి. లేకపోతే ఏమవుతుందో తెలుసా?
కొత్తగా వస్తున్న ''మొహంజొదారో'' సినిమానే తీసుకోండి. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ పూజా హెగ్డే కాస్ట్యూమ్స్ ఏదో గ్రీక్ ఐల్యాండ్ లో హాలీడే జరుపుకోవడానికి వేసుకొచ్చిన సెక్సీ బట్టల్లా ఉన్నా యి కాని.. అసలు మొహంజొదారో కాలం నాటి దుస్తుల్లా అనిపించలేదు. ఉదాహరణకు 10000 బిసి అనే ఇంగ్లీషు సినిమా చూసి రండి.. మీకు అర్ధమవుతుంది. ఇప్పుడు ఇదే సినిమాలోని టైటిల్ సాంగ్ రిలీజైంది. ఇందులో అయితే ఏకంగా ఫారిన్ డ్యాన్సర్లు హీరోయిన్ చుట్టూ తిరుగుతూ క్యాబరే స్టెప్పులు వేస్తుంటారు. దీని గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. మొహంజొదారో కాలంలో ఇలా ఫారినర్లు వచ్చి మనతో డ్యాన్సులు వేశారా? ఇంకా కనీసం ట్రాన్సపోర్టేషన్ కూడా కనిపెట్టని రోజులవి. ఫారినర్లు ఎక్కడి నుండి వచ్చారో మరి? టివి చూసి బూతులు తిట్టక ఏం చేస్తారు.
అందుకే.. ''గాంధి'' వంటి సినిమాలు హాలీవుడ్ వారు తీస్తే మనం చూడాల్సి వస్తోంది. మనం సొంతంగా ఒక్క చరిత్రను కూడా బాగా తీయలేకపోతున్నాం. కొత్త కాలం నాటి స్పోర్ట్స్ బయోగ్రాఫీలు ఓకె కాని.. ఇలాంటి పీరియాడిక్ ఫిలింస్ లో మాత్రం ఫెయిలవుతున్నాం.