Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: త్రిష హారర్ రివెంజ్ డ్రామా

By:  Tupaki Desk   |   21 Dec 2017 12:06 PM GMT
ట్రైలర్ టాక్: త్రిష హారర్ రివెంజ్ డ్రామా
X
హారర్ కథలకు ఒక సపరేట్ రూల్ ఉంటుంది అని మొన్నటి వరకు కొన్ని సినిమాలు వచ్చాయి. దానికి తోడు కామెడీ కూడా హారర్ కథలకు జత కలిసి ఓ వర్గం వారిని ఆకర్షిస్తున్నాయి. ఇక హారర్ కథలకు కొన్ని సీన్స్ అలాగే పేర్లు కూడా తరచూ మ్యాచ్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం. మోహిని అనే పేరు దెయ్యాలకు సంబందించిన నేమ్ గా కొందరు మార్చేశారు. ఆ పేరు మీద చాలా హారర్ కథలు వచ్చాయి.

అయితే ప్రేక్షకులు అలాంటి వాటి వైపు అంతగా చూడటం లేదు. కానీ కొంత మంది మంది దర్శకులు పాత ఫార్ములాను ఇంకా మరవడం లేదు. ఇప్పుడు మళ్లీ అదే తరహా నేమ్ తో త్రిషా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. తమిళ్ లో మోహిని అనే సినిమాలో త్రిష నటించింది. రీసెంట్ గా ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యింది. చూస్తుంటే.. హారర్ కథలో కొంచెం కొత్తగా విదేశి లొకేషన్స్ కూడా కనిపిస్తున్నాయి.అయితే రెగ్యులర్ ఫార్మాట్ లోనే కథ ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె శరీరాన్ని చంపేశావు గాని ఆత్మని చంపలేదు అనే డైలాగ్ లోనే హారర్ రివెంజ్ డ్రామా అని తెలుస్తోంది.

అయితే కథనంలో దర్శకుడు ఎలాంటి మ్యాజిక్ చేశాడు అన్నది సినిమా రిజల్ట్ పై ఆధారపడి ఉంటుంది. గ్రాఫిక్స్ అయితే చాలా పూర్ గా ఉన్నాయి. సినిమా మొత్తంగా అలానే ఉంటె కష్టం.ఆర్. మాదేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కానుంది. త్రిష ఇంతకుముందు హారర్ కథలను చేసిన సంగతి తెలిసిందే. కానీ ఆ సినిమాలు అంతగా ఆకట్టుకోలేవు. మరి ఈ సినిమా ఎంతవారకు సక్సెస్ అవుతుందో చూడాలి.