Begin typing your search above and press return to search.

నందమూరి నటవారసుడి ఎంట్రీ లేట్ అయ్యేలా ఉందే..!

By:  Tupaki Desk   |   23 Dec 2020 11:41 AM GMT
నందమూరి నటవారసుడి ఎంట్రీ లేట్ అయ్యేలా ఉందే..!
X
నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినిమాల్లోకి వస్తాడా లేదా రాజకీయ వారసత్వాన్ని అందుకుని పాలిటిక్స్ లోకి వెళ్లిపోతాడా.. బావ నారా లోకేష్ తో కలిసి పార్టీ వ్యవహారాలు చూసుకుంటాడా అని ప్రస్తుతం సినీ జనాలు తెగ మాట్లాడుకుంటున్నారు. నందమూరి తారక రామారావు నటవారసుడిగా బాలకృష్ణ తండ్రి పేరు నిలబెడుతూ ఇండస్ట్రీలో తనదైన శైలిలో సినిమాలు చేస్తున్నాడు. ఆ తర్వాత తరంలో జూనియర్ ఎన్టీఆర్ 16వ ఏట ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టి స్టార్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. ఇక మోక్షజ్ఞ ఎంట్రీ కూడా త్వరలోనే ఉంటుందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా మోక్ష ని చూసిన నందమూరి అభిమానులు అబ్బాయి ఎంట్రీ కాస్త లేట్ అయ్యేలా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.

ఇటీవల నందమూరి జయకృష్ణ తనయుడు చైతన్య కృష్ణ పెళ్లి ఫోటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఇందులో మోక్షజ్ఞ ని చూసిన ఫ్యాన్స్ షాక్ కు గురయ్యారు. దీనికి కారణం నందమూరి వారసుడు హీరో పర్సనాలిటీతో కాకుండా కాస్తంత ఒళ్లు చేసినట్టు కనిపించాడు. గత కొన్ని సంవత్సరాలుగా మోక్షజ్ఞలో ఫిజిక్ పరంగా ఎలాంటి మార్పు కనిపించకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారని తెలుస్తోంది. అయితే ఎప్పటినుంచో బాలక్రిష్ణ కొడుకు కోసం కథలు వింటున్నాడని.. డైరెక్టర్లతో మాట్లాడుతున్నాడని ఇలా చాలా వార్తలొచ్చాయి. కానీ ఇప్పటివరకు మోక్షజ్ఞ లాంచింగ్‌ గురించి ఎలాంటి అనౌన్స్‌మెంట్ రాలేదు. కాకపోతే బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మోక్ష‌జ్ఞ ఎంట్రీకి భారీగా ప్లాన్స్ వేసుంచానని.. అద్భుతమైన స్క్రిప్ట్స్ కూడా తీసి పెట్టానని.. అన్నీ కుదిరినప్పుడు లాంచ్ ఉంటుందని.. దానికి ఇంకా సమయం పట్టొచ్చని చెప్పుకొచ్చాడు. అయితే ఫ్యాన్స్ మాత్రం మిగిలిన ఫ్యామిలీ హీరోలు టాలీవుడ్‌ లో దూపుకుపోతున్నారని.. మోక్షజ్ఞ కూడా వీలైనంత త్వరగా ఎంట్రీ ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు.