Begin typing your search above and press return to search.
అతడితో బాలయ్య కొడుకు ఫ్రెండ్ షిప్
By: Tupaki Desk | 13 Feb 2017 4:46 PM GMTనందమూరి నటసింహం బాలకృష్ణ.. నిర్మాత బెల్లంకొండ సురేష్ ల మధ్య విబేధాలు ఉన్నాయని ఒకప్పుడు ప్రచారం గట్టిగానే జరిగింది. అప్పట్లో దీనిపై కొంత సీరియస్ నెస్ కూడా అలముకుంది. అయితే.. పిలిం ఇండస్ట్రీలో శాశ్వత శతృత్వం ఉండదనే విషయం ఇప్పుడు ప్రూవ్ అయిపోయింది. అప్పట్లో ఏదో జరిగినా.. ఆ తర్వాత ఇరువైపుల వాళ్లు ఆ విషయాన్ని వదిలేశారు.
ఇప్పుడు బాలయ్య కుమారుడు నందమూరి మోక్షజ్ఞ ఫ్రెండ్స్ సర్కిల్ చూస్తే ఆ విషయం అర్ధమవుతుంది. బెల్లంకొండ సురేష్ చిన్న కొడుకు గణేష్.. మోక్షజ్ఞకు బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒకడు. మోక్షజ్ఞ తన ఫ్రెండ్స్ అందరితో కలిసి ఎంజాయ్ చేసేటపుడు కచ్చితంగా బెల్లంకొండ గణేష్ కనిపిస్తున్నాడు. మరోవైపు ఇండస్ట్రీతో సంబంధం ఉన్న వ్యక్తులలో నందమూరి వారసుడికి ఈ కుర్రాడే బెస్ట్ ఫ్రెండ్ అంటున్నారు సన్నిహతులు.
ఒకవేళ కుటుంబాల మధ్య విబేధాలు ఉంటే.. వారసులు ఇంతగా కలిసిపోయే అవకాశం ఉండదు. బాలకృష్ణ-బెల్లంకొండల మధ్య వివాదం ఎప్పుడో సమసిపోయిందనే విషయాన్ని.. ఇప్పుడు కుర్రాళ్లు ఇలా ప్రపంచానికి చాటి చెబుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/