Begin typing your search above and press return to search.

పాతాళ భైర‌వి రీమేక్‌ లో మోక్ష‌జ్ఞ‌?

By:  Tupaki Desk   |   11 Sep 2015 2:07 AM GMT
పాతాళ భైర‌వి రీమేక్‌ లో మోక్ష‌జ్ఞ‌?
X
ఏ నోట విన్నా నంద‌మూరి న‌ట‌వార‌సుడు మోక్ష‌జ్ఞ ఎంట్రీ గురించే చ‌ర్చ. ఇటు నంద‌మూరి అభిమానులు ఎంతో ఎగ్జియిటింగ్‌ గా ఉన్నారు. అటు కామ‌న్ జ‌నాల్లోనూ ఆత్రుత క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే మోక్ష‌జ్ఞ పేరు ప‌ల్లె ప‌ల్లెనా మార్మోగిపోతోంది. అస‌లు మోక్ష‌జ్ఞ న‌టించే మొద‌టి సినిమా ఎలా ఉంటుంది? ఎలా ఉంటే బావుంటుంది? అత‌డు ఎలా క‌నిపించ‌కూడ‌దు... లాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ క‌దులుతోంది ప్ర‌తిచోటా!!

అస‌లు మోక్ష‌జ్ఞ ఎలాంటి సినిమాలో న‌టిస్తే బాల‌య్య‌కు సంతోషం? అస‌లు న‌ట‌సింహా ఎలాంటి క‌థ కావాల‌నుకుంటున్నారు? మోక్షు అంద‌రిలానే ఓ రొటీన్ రొమాంటిక్ ల‌వ్‌ స్టోరీ తోనే ఎంట్రీ ఇస్తే చూడాల‌నుకుంటున్నారా? లేక టాలీవుడ్‌ లో రికార్డులు తిర‌గ‌రాసే ఓ బ్లాక్‌ బ‌స్ట‌ర్ హిట్‌ లో న‌టిస్తే చూడాల‌నుకుంటున్నారా? ఏమ‌ని అనుకుంటున్నారు? ఇలాంటి ఆస‌క్తిక‌ర డిష్క‌స‌న్ సాగుతోంది. ఇటు ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు, అటు కామ‌న్ జ‌నం ఈ విష‌యంపైనే చ‌ర్చించుకుంటున్నారు. కొర‌టాల‌, బోయ‌పాటి, రాజ‌మౌళి, వినాయ‌క్, పూరీ వీళ్ల‌లో ఎవ‌రు అత‌డిని లాంచ్ చేస్తారు అన్న‌ది స‌స్సెన్స్‌. ఎవ‌రేం చేసినా మ‌ళ్లీ రొటీన్ స్ట‌ఫ్‌తోనే మోక్షు క‌నిపించ‌కూడ‌దు. అలా రొటీన్‌గా క‌నిపిస్తే ఈ యువ‌హీరో త‌న‌దైన ముద్ర వేయ‌లేడు. చ‌ర‌ణ్‌, బ‌న్నిలాగా అత‌డు ఎంట్రీ ఇస్తానంటే కుద‌ర‌దు. ఇప్పుడు అఖిల్ ఏ రేంజులో ప్లాన్ చేశాడో అంత బ‌డ్జెట్‌తో రావాలి. పైగా అఖిల్ ఎంచుకున్న క‌థ కంటే ఇంకా గొప్ప క‌థ‌తో రావాలి. ఫిక్ష‌న్‌, సైన్స్ ఫిక్ష‌న్ చేస్తే అది టాలీవుడ్‌కి కొత్త‌గా ఉంటుంది.

ఇప్ప‌టికైతే నంద‌మూరి ఫ్యామిలీలో ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ లేవ‌నెత్తార‌ని ఓ వార్త లీకైంది. మోక్ష‌జ్ఞ అల‌నాటి మేటి క్లాసిక్ పాత‌ళ భైర‌విలో న‌టిస్తే ఎలా ఉంటుంది? అన్న ఇంట్రెస్టింగ్ టాపిక్ క‌దిలింది. 1951లో రిలీజైన పాతాళ భైర‌వికి పింగ‌ళి నాగేంద్ర‌రావు ర‌చ‌యిత‌. కె.వి.రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఎన్టీఆర్‌, ఎస్వీఆర్‌, మాల‌తి వంటి దిగ్గ‌జాలు ఇందులో న‌టీన‌టులు. మేటి క్లాసిక్‌కి ఇది ఎగ్జాంపుల్‌. అలాంటి సినిమాని మోడ్ర‌న్ టెక్నాల‌జీతో బాహుబ‌లి రేంజులో తెర‌కెక్కిస్తే సినిమా హిట్టే. మ‌గ‌ధీర‌, బాహుబ‌లి రేంజు సినిమాతో మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఇవ్వాల‌ని నంద‌మూరి అభిమానులు కూడా త‌పిస్తున్నారు. ఆ ఒక్క సినిమాతోనే 100కోట్ల క్ల‌బ్‌ లో చేరే హీరో అవ్వాల‌ని త‌పిస్తున్నారు. ఆలోచ‌న బాగానే ఉంది. ఆచ‌ర‌ణ‌లో ఇది ఎంత‌వ‌ర‌కూ సాధ్య‌మ‌వుతుందో చూడాలి.