Begin typing your search above and press return to search.
మోక్షజ్ఞ కు ఐదారు ఆప్షన్లున్నాయ్
By: Tupaki Desk | 10 Aug 2015 5:52 AM GMTవరుణ్ తేజ్ ని శ్రీకాంత్ అడ్డాల లాంచ్ చేశాడు. బెల్లంకొండ శ్రీనివాస్ ని లాంచ్ చేసిన వి.వి.వినాయక్ అఖిల్ ని కూడా లాంచ్ చేస్తున్నాడు. మరి బాలయ్య బాబు నటవారసుడు మోక్షజ్ఞ ను లాంచ్ చేయడానికి ఎవరొస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం అంత వీజీ కాదు. నందమూరి నటవారసుని 2017లో లాంచ్ చేయాలని భావిస్తున్నారు.. కాబట్టి ఇప్పట్నుంచే డిష్కసన్ మొదలైంది. ఒక డెబ్యూ హీరోని మాస్ స్టయిల్ లో లాంచ్ చేయాలంటే టాలీవుడ్ లో ఐదారు ఆప్షన్లు ఉన్నాయి. అవేంటో పరిశీలిస్తే...
ఎస్.ఎస్.రాజమౌళి, వినాయక్, బోయపాటి శ్రీను, పూరి జగన్నాథ్ ఈ నలుగురిలో ఎవరో ఒకరైతే ఆ హీరో ఇమేజ్ ఆరంభమే స్కై లోకి వెళుతుంది. అయితే రాజమౌళి ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఎవరికీ చిక్కేట్టు లేడు. బాహుబలి 2 తర్వాత మహేష్ తో సినిమా చేస్తాడు. అంటే 2017 ఎండింగ్ వరకూ అతడితో కష్టం. వినాయక్ విషయంలో ఇంతవరకూ మోక్షజ్ఞ ప్రస్థావనే లేదు. ఆ డిష్కసనే లేదు. ఇక పూరి మునుముందు చిరంజీవి, మహేష్ ప్రాజెక్టులతో బిజీ అయిపోతున్నాడు. బాలయ్య బాబుకి రెండు బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన బోయపాటి చేతిలో మోక్షజ్ఞ ని పెడదామని అనుకుంటున్నారు. అయితే బోయపాటి అందుబాటులో లేని పక్షంలో వేరొక ఆప్షన్ ఇంకేం ఉంది? అని ప్రశ్నిస్తే .. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ల లీగ్ లోకి మెరుపులా దూసుకొచ్చిన కొరటాల కనిపిస్తున్నాడు.
ఫ్యామిలీ ఎమోషన్ ని పీక్స్ లో చూపిస్తూనే హీరోయిజం ఎలివేట్ చేసే సత్తా ఉన్న దర్శకుడిగా ఇప్పటికే నిరూపించుకున్నాడు కొరటాల. మిర్చి, శ్రీమంతుడు రెండు చిత్రాల్లో కంటెంట్ బాలయ్య అభిమానులకు నచ్చేదే. కాబట్టి మోక్షజ్ఞ ను మాస్ స్టయిల్ లో ఆవిష్కరిస్తే ఆ రేంజే వేరుగా ఉంటుంది అనుకున్నప్పుడు బోయపాటి లేదా కొరటాల అన్న డిష్కసన్ షురూ అన్నమాట. కాలమే సమాధానం చెప్పాలి.